కేన్స్ నుంచి నేరుగా థాయ్ లాండ్ బీచ్ లో వాలింది

Tue May 24 2022 11:18:45 GMT+0530 (IST)

Directly from Cannes to Thailand Beach

కేన్స్ 2022 రెడ్ కార్పెట్ పై సౌత్ భామల సందడి గురించి తెలిసిందే. అయితే ఎందరు ఉన్నా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా తనదైన హవాకు ఎదురే లేకుండా కొనసాగింది. కేన్స్ ఉత్సవాలకు ఎంతో ప్రిపరేషన్ తో వెళ్లిన మిల్కీ అందరి దృష్టిని ఆకర్షించింది. కేన్స్ లో హాటెస్ట్ సౌతిండియా బ్యూటీగా హాలీవుడ్ ప్రముఖుల కళ్లలోనూ పడింది.అయితే నియాన్ కాంతుల వెలుగు జిలుగుల నడుమ కొద్దిరోజులుగా అలసిసొలసిన తమన్నా వెంటనే రెస్ట్ కోరుకుంది. అందుకే కేన్స్ నుంచి నేరుగా థాయ్ లాండ్ కి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది. ఈ విరామం తనకు చాలా అవసరమని తమన్నా భావించిందట.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో థాయ్ ల్యాండ్ నుంచి కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేయగా అవి అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. బీచ్ వెకేషన్ కోసం తమన్నా సౌకర్యవంతమైన దుస్తుల్ని ధరించింది. ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించింది.

మిల్కీ వైట్ దేహశిరుల్ని మెరుస్తున్న చర్మాన్ని థాయ్ లాండ్ లో ప్రదర్శించింది. ఫోటోలలో తమన్నా హై-వెస్ట్ రిప్డ్ జీన్స్‌తో జోడించిన బ్లూ క్రాప్ టాప్ లో కనిపించింది.

పోస్ట్ ను షేర్ చేస్తూ ''మిస్ బి అండ్ హర్ బీచ్ లైఫ్'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక కేన్స్ లో తమన్నా రకరకాల డిజైనర్ లుక్స్ లో మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే.

తమన్నా భాటియా ఇటీవలి కెరీర్ ని పరిశీలిస్తే.. బాహుబలి- సైరా నరసింహ రెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రాలలో నటించి కంబ్యాక్ అయ్యింది. తదుపరి వెంకటేష్- వరుణ్ తేజ్- మెహ్రీన్ పిర్జాదాతో కలిసి  F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తుంది. ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఆమె నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చుడియాన్ .. రితీష్ దేశ్‌ముఖ్ తో 'ప్లాన్ ఏ ప్లాన్ బి' చిత్రాల్లోనూ నటిస్తోంది. తమన్నా నటించిన ఇతర తెలుగు సినిమాలు విడుదలకు రానున్నాయి.