Begin typing your search above and press return to search.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే 'హిట్టు బొమ్మ' కిందే లెక్కా..?

By:  Tupaki Desk   |   26 Nov 2020 10:10 AM GMT
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే హిట్టు బొమ్మ కిందే లెక్కా..?
X
కరోనా మహమ్మారి కారణంగా గత తొమ్మిది నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లు - కొత్త సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాయి. మొదట్లో తెలుగు నుంచి చిన్న సినిమాలే ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ.. ఇప్పుడు క్రేజీ మూవీస్ ని కూడా డైరెక్ట్ ఓటీటీ విడుదల చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే ఓటీటీలో విడుదలైన సినిమా హిట్ ప్లాప్ అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వసూళ్లను బట్టి హిట్ - ప్లాప్ - యావరేజ్ అనేది నిర్ణయించేవారు. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసే సినిమా రేంజ్ ని డిసైడ్ చేసేవారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ లాభాల బాట పడితే సినిమా హిట్ గా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలయ్యే సినిమాల విషయంలో కలెక్షన్స్ అనేది ప్రామాణికంగా తీసుకోరు. వ్యూయర్ షిప్ ని బట్టి ప్రేక్షకాదరణ పొందిందా లేదా అనేది చూస్తారు. కానీ నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీలు వ్యూయర్ షిప్ ని బయటపెట్టడం లేదు.

కాకపోతే ఓటీటీలో సినిమా డైరెక్ట్ రిలీజ్ అవుతుందంట‌నే ప్రొడ్యూసర్స్ కమర్షియల్ గా లాభాల్లో ఉన్న‌ట్లే లెక్క. ఎంతో కొంత ప్రాఫిట్ చూసుకునే మేకర్స్ తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముతున్నారు. అంటే ఓటీటీలో విడుదలైన ప్రతి సినిమాని కూడా హిట్ గా భావించవచ్చు. ఈ మధ్య ఓటీటీలో విడుదలైన చాలా సినిమాలు, థియేట్రికల్ రిలీజ్ చేసి ఉంటే ప్లాప్ అయ్యేవి అనే విధంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఓటీటీలలో బాగానే వ్యూయర్ షిప్ తెచ్చుకున్నాయి. దీనిని బట్టి చూస్తే చిన్న మీడియం రేంజ్ సినిమాలకు మంచి వేదికనే చెప్పవచ్చు.