సినీ పరిశ్రమలో విషాదం.. కరోనాతో మరో దర్శకుడి మృతి!

Tue May 04 2021 12:00:10 GMT+0530 (IST)

Direcctor Kumar Vatti Passes Away

దేశంలోని పలు సినీ పరిశ్రమలకు చెందిన వారిని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటి వరకు ఎంతోమంది నటులు టెక్నీషియన్స్ ప్రాణాలు కోల్పోయారు. తడిచిన వారంలోనే ఐదుగురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. మరో యువ దర్శకుడు కరోనా కల్లోలానికి బలయ్యాడు.శనివారం టాలీవుడ్ దర్శకుడు శ్రవణ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్ హీరోగా ‘ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు శ్రవణ్.. కొన్ని రోజులుగా కొవిడ్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. అదేరోజు.. బాలీవుడ్ సీనియర్ నటుడు బిక్రమ్ జీత్ కూడా కరోనాతో చనిపోయారు. ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రభాస్ ‘సాహో’తో తెలుగువారికి కూడా పరిచయం అయ్యారు.

శుక్రవారం మరో ఇద్దరు కరోనాతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ తమిళ దర్శకుడు కేవీ ఆనంద్ ను కొవిడ్ బలిగొంది. సినిమాటోగ్రాఫర్ గా దర్శకుడిగానూ తనదైన ముద్రవేశారు. అదేరోజు సాయంత్రం.. మరో టాలీవుడ్ డైరెక్టర్ కుమార్ వట్టి కూడా ప్రాణాలు కోల్పోయారు. యువ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా వచ్చిన ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన కుమార్.. కరోనాతో తుదిశ్వా విడిచారు.

తాజాగా.. శాండల్ వుడ్ యంగ్ డైరెక్టర్ నవీన్ (36) కరోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మండ్యాకు చెందిన నవీన్.. 2011లో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ‘వన్ డే’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. మరో సినిమా డైరెక్ట్ చేసేందుకు కథ సిద్దం చేసుకుంటున్నారు. అలాంటి నవీన్ కు కొవిడ్ సోకడంతో.. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. సోమవారం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.