కంగనా ట్వీట్ పై బాలీవుడ్ యువ హీరో ఆగ్రహం..!

Thu Dec 03 2020 22:14:41 GMT+0530 (IST)

Diljit Dosanjh slams Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా తలదురుస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఆమెపై వివిధ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసనలకు సంబంధించిన ఓ వీడియోలో సిక్కు మహిళను చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'డబ్బులకు ఆశపడి ఓ సిక్కు వృద్ధ మహిళ నిరసన తెలిపడానికి వచ్చింది' అంటూ ట్వీట్ చేసిన కంగన ఓ వీడియోను షేర్ చేసింది. 'ఆ వీడియోలో ఉన్న మహిళ షహీన్ బాగ్ లో అల్లర్లకు కారణమైన బిల్కిస్ బానో. భారతీయ ప్రతిష్టతను పాక్ మీడియా హైజాక్ చేసింది. మనపై బురద జల్లడానికి చేసిన ప్రయత్నాలను ఎండగట్టాలి' అంటూ కామెంట్ చేసింది.అయితే వృద్ధురాలిపై కంగన చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు దిల్ జిత్ దోసాన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బిల్కిస్ బానో కాదు.. వీడియోలో కనిపిస్తున్నది మహిందర్ కౌర్. మన తల్లులు దేవుళ్లతో సమానం. అలాంటి వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశావు. మహిందర్ కౌర్ ఒక రైతు. ఆమె రైతుల ఆందోళనలో పాల్గొన్నారు' అని దిలిజిత్ పేర్కొన్నారు. 'మహిందర్ కౌర్ జీ.. కంగన టీమ్ కు మీరు సాక్ష్యాలతో నిరూపించండి. కంగన మీరు గుడ్డిగా కామెంట్లు చేయకండి. మీరు ఈ మధ్య ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇకనైనా రుజువులతో కామెంట్ చేయండి' అని దిలిజిత్ చెప్పుకొచ్చారు. దీనికి మహిందర్ కౌర్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా జత చేసాడు. ఇందులో 'నేను రైతునా కాదా.. నా పని ఏంటో చూడాలంటే మీరు రండి' అంటూ ఆ వృద్ద మహిళ ఘాటుగా వ్యాఖ్యానించారు.