వారసుడు హీరోగా నిలబడడం కష్టం అంటున్నారే!

Sat Feb 22 2020 13:30:08 GMT+0530 (IST)

Dilemma On That Hero Next Movie Release

పెద్ద స్టార్ హీరో ఫ్యామిలీ వారసుడుగా ఉంటే చాలు హీరోగా స్థిరపడిపోవచ్చనేది సాధారణ జనాల అభిప్రాయం..  కుదిరితే స్టార్ హీరోగా.. కుదరకపోతే మీడియం రేంజ్ హీరోగా టాలీవుడ్ ను ఎడాపెడా దున్నుకోవచ్చనే ఆలోచనలో చాలామంది ఉంటారు.  కానీ వాస్తవం మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది.  జస్ట్ వారసుడు అనే టాగ్ తో పాటుగా మరెన్నో అంశాలు కలిసి వస్తే కానీ హీరోగా నిలదొక్కుకోలేరు.  ఫిల్మీ నేపథ్యంతో పాటు మంచి కథలు ఎంచుకోవడం..  నిజాయితీగా కష్టపడడంతో పాటుగా హీరోగారి ప్రవర్తన కూడా అతని కెరీర్ ను డిసైడ్ చేస్తుంది.  టాలీవుడ్ లో ఒక వారసుడు ఉన్నాడు. భారీ సినీ నేపథ్యం ఉంది.  కావలసినంత సపోర్ట్ ఉంది. అయితే ఈ యువ హీరోపై ఇండస్ట్రీలో విపరీతంగా నెగెటివిటీ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎవరితో ఈ వారసుడు గురించి మాట్లాడినా హీరోగా నిలదొక్కుకోవడం ఆ కుర్రాడికి కష్టమేనని ఎక్కువమంది తేల్చిపారేస్తున్నారు.  కుర్రాడి యాటిట్యూడ్ సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే ఒక లాంచ్ అయింది. మరోసారి రీ లాంచ్ చేసినా ఫలితం లేదు..  ఇలా కొన్ని రాక్షస ప్రయత్నాలు చేసిన అనంతరం ఈ కుర్రాడిని ఒక సీనియర్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టి కెరీర్ సెట్ చేయాలని కోరారు.  ఆయన బ్యానర్ లో సక్సెస్ రేట్ ఎక్కువ. దాదాపుగా హిట్ గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది.  మరి ఈ వారసుడికి ఆ నిర్మాత హిట్ ఇవ్వగలుగుతాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి.  ఏం జరుగుతుందో వేచి చూడాలి.