ఫోటో స్టోరి: దిల్బార్ నాచ్ మేరీ రాణి వేంచేశారు

Fri Dec 04 2020 12:00:53 GMT+0530 (IST)

Dilabar Nach Dress Handbag Cost 5 Lakhs

బాహుబలి మనోహరిగా నోరా ఫతేహికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అటు నార్త్ ఇటు సౌత్ రెండుచోట్లా ఈ విదేశీ డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి ప్రత్యేకించి వీరాభిమానులున్నారు.  సోషల్ మీడియాలో భారీ అభిమానుల ఫాలోయింగ్ ని కలిగి ఉన్న ఐటెమ్ గాళ్ గా పాపులరైంది.  సాకి సాకి... దిల్బార్ నాచ్ మేరీ రాణి.. వంటి స్పెషల్ నంబర్ల తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది ఈ బ్యూటీ. బిగ్ బాస్ 9 ఇంటి సభ్యురాలై పాల్గొని తన కీర్తిని విస్తరించింది.ఈ విదేశీనటి చివరిసారిగా వరుణ్ ధావణ్ -శ్రద్ధా కపూర్ లతో స్ట్రీట్ డాన్సర్ 3 లో కనిపించింది. తనవైన నత్యవిన్యసాలతో సాటి నాయికలకు ఐటెమ్ భామలకు నృత్య నైపుణ్యం విషయంలో తీవ్రమైన అసూయను పెంచిందంటే అతిశయోక్తి కాదు.

ఇక నోరా ఫతేహి స్టైల్ ఐకన్ గానూ బాలీవుడ్ లో వెలిగిపోతోంది. ఈ అమ్మడి పబ్లిక్ అప్పియరెన్స్ నిరంతరం హాట్ టాపిక్. కచ్చితంగా లగ్జరీ డిజైనర్ దుస్తుల విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటుంది. విమానాశ్రయం లుక్ పరంగానూ నోరాకి బోలెడంత ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇటీవల నోరా తన రాబోయే చిత్రం భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి హైదరాబాద్ కి వచ్చారు. ఆమె విమానాశ్రయంలో గూచీ రిబ్బన్ రిఫ్లెక్టివ్ ట్రాక్ సూట్ ధరించింది. దీని ధర సుమారు రూ.240000. ఆమె జిప్-ఫ్రంట్.. బ్లాక్ టెక్నికల్ భారీ జెర్సీ హూడీలో జి-స్ట్రిప్ ని ధరించి కనిపించింది. ఇది సాధారణంగా పాతకాలపు ట్రాక్ సూట్లలో కనిపించే లోగో టేపులను గుర్తు చేస్తుంది. ట్రాకీ బాటమ్ ని టాప్ లో జాకెట్ ని ధరించి కనిపించింది.

తాజాగా మరోసారి ముంబై ఎయిర్ పోర్ట్ లో అందుకు పూర్తి భిన్నమైన కలర్ కాంబినేషన్ తో కొత్త లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది నోరా. ఈసారి పింక్ టాప్ .. బ్లాక్ టైట్ షార్ట్ ని ధరించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఆ కళ్లకు షేడెడ్ గ్లాసెస్ హ్యాండ్ బ్యాగ్ తో నోరా అదరగొట్టింది. చీలమండ బూట్లతో .. లూయిస్ విట్టన్ తో నోరా యాక్సెసరైజెస్ మోనోగ్రామ్ ఎంప్రింట్ ..తో భారీ ఒంటెగో జిఎమ్ టోటెతో అద్భుతమైన ఎంబోస్డ్ తోలుతో... క్రీమ్ హ్యాండ్ బ్యాగ్ ధర సుమారు రూ. 240000.

ఇంతలోనే ఎంత మార్పు. తన రూపాన్ని ఎంతగా ఊసరవెల్లిలా మార్చేస్తోంది! అంటూ యూత్ ఒకటే పరేషాన్ అయిపోతున్నారంతే. ఆమె ఒంటిపై డ్రెస్సు హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 5లక్షలే అంటూ షాకైపోతున్నారు మరి.