సంక్రాంతికి దిల్ రాజు గట్టి దెబ్బ కొట్టబోతున్నాడా?

Tue Sep 27 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Dil raju pongal festival movies

వచ్చే ఏడాది సంక్రాంతి సమరానికి ఇప్పటి వరకు భారీ పోటీ వుంటుందని లిస్ట్ భారీగానే వుంటుందని అంతా భావిస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా రెండు సినిమాలు తప్ప మరో స్టార్ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫమ్ గా ప్రకటించలేదు. దీంతో గత కొన్ని రోజులుగా సంక్రాంతి సీజన్ పై ఇంకా క్లారిటీ రావట్లేదనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. కొంత మంది ఇంకా టైమ్ వుంది కదా అని సైలెంట్ గా వుంటే మరి కొంత మంది మాత్రం సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అయిపోతున్నారు.ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `ఆది పురుష్` మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే మిగతా సినిమాలు కూడా పోటీకి దిగుతాయంటూ వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లపై క్లారిటీ రాలేదు. చాలా వరకు సినిమాలు షూటింగ్ లు చివరి షెడ్యూల్ ని పూర్తి చేసుకునే దశలోనే వుండటంతో మేకర్స్ ఎటూ తేల్చలేకపోతున్నారు.

కానీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాత్రం ఈ సంక్రాంతికి తమిళ సినిమాతో తెలుగు సినిమాలకు గట్టి దెబ్బేసేలా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో దిల్ రాజు ఓ భారీ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో `వారీసు`గా తెలుగులో `వారసుడు`గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది.

రెండు పాటలు కొన్ని కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. వచ్చేనెల మిడ్ కి ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తెలుగు తమిళ భాషలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి సినిమాని అక్కడ పొంగల్ ఇక్కడ సంక్రాంతి సమరానికి రెడీ చేస్తున్నారు. వచ్చే నెల దీపావళికి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారట. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కి రికార్డు స్థాయి రేట్ కి ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ విషయంలో చక్ చకా పావులు కదుపుతున్న దిల్ రాజు ఈ మూవీతో సంక్రాంతికి తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో దెబ్బేయడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అప్పుడే గుసగుసలు మొదలు పెట్టాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రముఖ నటీనటులు నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.