బ్రేకింగ్ : దిల్ రాజుకు వారసుడు పుట్టాడు!

Wed Jun 29 2022 10:23:22 GMT+0530 (IST)

Dil Raju is to Become a Father again

స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తో పాటు స్టార్ డిస్ట్రిబ్యూటర్ గానూ టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. చిన్న సినిమాలతో పాటు పాన్ ఇండియా మూవీస్.. బాలీవుడ్ మూవీస్ లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న దిల్ రాజు తండ్రయ్యాడు. అయనకు తాజాగా వారసుడు పుట్టాడు. ఆయన భార్య తేజస్విని బుధవారం ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చారు.తల్లి బాబు క్షేమంగా వున్నారు. ఈ వార్త బయటికి తెలియడంతో టాలీవుడ్ వర్గాలు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు వారసుడు పుట్టాడు అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ ల వర్షం కురిపిస్తున్నారు.

2020 డిసెంబర్ లో కరోనా రిస్ట్రెక్షన్స్ మధ్య దిల్ రాజు తేజస్వినిల వివాహం జరిగింది. దిల్ రాజుకు ఇది రెండో వివాహం. దిల్ రాజు మొదటి భార్య అనిత. ఆయన నిర్మించిన చాలా సినిమాలకు ఆమె సమర్పకురాలిగా కూడా వ్యవహరించారు.

అయితే అనారోగ్య కారణాల వల్ల దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో కన్నుమూశారు. వీరికి హన్షితా రెడ్డి అనే కుమార్తె వుంది. మొదటి భార్య మరణానంతరం నిర్మాత దిల్ రాజు వరంగల్ కు చెందిన తేజస్విని కుటుంబ సభ్యుల అంగీకారంతో రెండవ పెళ్లి చేసుకున్నారు.

2020 డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. దిల్ రాజు ఇటీవల 'ఎఫ్ 3' సినిమాని విడుదల చేశారు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.

ఈ మూవీ తరువాత ప్రస్తుతం దిల్ రాజు బాలీవుడ్ లో 'హిట్ :  ది ఫస్ట్ కేస్' ని రాజ్ కుమార్ రావుతో రీమేక్ చేస్తున్నారు. అంతే కాకుండా తెలుగులో రెండు బారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి - దళపతి విజయ్ లతో బైలింగ్వల్ మూవీతో పాటు రామ్ చరణ్ - శంకర్ ల కాబినేషన్ లో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు భారీ చిత్రాలు నిర్మాణ దశలో వున్నాయి.