Begin typing your search above and press return to search.

దిల్ రాజు అన్నట్లేగా సూపర్ స్టార్‌ ను తీసుకు వచ్చాడే...!

By:  Tupaki Desk   |   23 Jan 2023 4:53 PM GMT
దిల్ రాజు అన్నట్లేగా సూపర్ స్టార్‌ ను తీసుకు వచ్చాడే...!
X
తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్‌ హైదరాబాద్ వచ్చాడు. వారసుడు సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్‌ లో పాల్గొన్నాడు. దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమా తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుని అత్యధిక వసూళ్లను నమోదు చేస్తూ దూసుకు పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా కూడా అక్కడ వస్తున్న కలెక్షన్స్ తో దిల్‌ రాజు కాంపౌండ్ ఫుల్‌ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు లో ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయని మేకర్స్ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌ లో సినిమా యొక్క సక్సెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సక్సెస్ పార్టీలో హీరో విజయ్ పాల్గొన్నాడు. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ కు విజయ్‌ ని తీసుకు వస్తాను అంటూ మీడియా సమావేశంలో దిల్‌ రాజు పేర్కొన్నాడు.

సినిమా విడుదలకు ముందు విజయ్ ని హైదరాబాద్ కు తీసుకు రాలేక పోయిన దిల్ రాజు విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్టీకి తీసుకు వచ్చాడు అనే టాక్‌ వినిపిస్తుంది. ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ రాని విజయ్‌ ఇప్పుడు పార్టీకి హైదరాబాద్‌ రావడం ఏంటో అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

ప్రమోషన్‌ విషయంలో అస్సలు ఆసక్తి చూపించని విజయ్ హైదరాబాద్‌ కు ప్రత్యేకంగా వారిసు సినిమా యొక్క సక్సెస్ పార్టీకి వచ్చాడా లేదంటే ఏదైనా సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి వారిసు సినిమా యొక్క సక్సెస్ పార్టీ లో పాల్గొన్నాడా అంటూ చర్చ జరుగుతోంది.

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారిసు/వారసుడు సినిమాలో విజయ్ కి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

తమిళనాట ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లతో దిల్‌ రాజు ముందు ముందు మరిన్ని తమిళ సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాడు అంటూ ఆయన ఆఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.