విజయ్ - దిల్ రాజు కాంబో అంతా సెట్ !

Thu Dec 05 2019 14:14:45 GMT+0530 (IST)

Dil Raju Movie with Vijay Deverakonda

ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దిల్ రాజు వచ్చే ఏడాదికి వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు హుషారు దర్శకుడు శ్రీ హర్ష దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.  పూరి 'ఫైటర్' తో పాటు దిల్ రాజు బ్యానర్ సినిమాను కూడా ఒకే టైంలో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్. సో వచ్చే ఏడాది రౌడీ సినిమాతోనే దిల్ రాజు నెక్స్ట్ ఇయర్ సినిమాల హంగామా మొదలవుతుందన్నమాట.