Begin typing your search above and press return to search.

స్లిమ్ గా తయారైన దిల్ రాజు..!

By:  Tupaki Desk   |   5 July 2020 8:15 AM GMT
స్లిమ్ గా తయారైన దిల్ రాజు..!
X
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్‌ లో తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నాడు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణా రెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. కాగా దిల్ రాజు ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. తన భార్య మరణం తర్వాత కొన్ని రోజులు ఒంటరి జీవితం గడిపిన ఆయన వైగా రెడ్డిని వివాహం చేసుకున్నారు. యాభై ఏళ్లకు పైగా వయసున్న దిల్ రాజు మూడు పదుల వయసున్న యువతిని పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా దిల్ రాజు పెళ్లి తర్వాత బాడీ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాడని అర్థం అవుతోంది. ఇటీవల సతీసమేతంగా తిరుమల సందర్శించిన ఆయన లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేయకపోవడంతో కావలసినంత సమయం దొరకడంతో ఫిజికల్ ఫిట్నెస్ మీద కేర్ తీసుకుంటున్నారు దిల్ రాజు. ఈ క్రమంలో వెయిట్ తగ్గడమే కాకుండా బాడీ షేప్ కూడా మార్చే పనిలో పడ్డాడట. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా జిమ్ సెషన్ లో పాల్గొనడంతో పాటు తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. దిల్ రాజు బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత తన భార్యతో కలిసి దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తే దిల్ రాజు చాలా స్లిమ్ గా తయారై యంగ్ గా కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. తాను ఆరోగ్యంగా ఉండటంతో పాటు హ్యాండ్సమ్ గా కనిపించడానికి దిల్ రాజు బాగానే కష్టపడుతున్నాడని సినీ అభిమానులు చెప్పుకుంటున్నారు.

కాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నాని - సుధీర్ బాబు హీరోలు గా నటించిన 'వి' సినిమా ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల కుదరలేదు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమా 'వకీల్ సాబ్'. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కొంతమేర షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు హిందీలో రీమేక్ అవుతున్న 'జెర్సీ' సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమాల షూటింగ్స్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.