Begin typing your search above and press return to search.

`ఐక‌న్ స్టార్‌`.. అది ఆయ‌నే పెట్టుకున్నాడు.. మ‌నం పెట్టింది కాదు.. దిల్ రాజు బైట్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   18 April 2021 3:30 AM GMT
`ఐక‌న్ స్టార్‌`.. అది ఆయ‌నే పెట్టుకున్నాడు.. మ‌నం పెట్టింది కాదు.. దిల్ రాజు బైట్ వైర‌ల్!
X
`స్టైలిష్ స్టార్` అల్లు అర్జున్ ని `పుష్ప‌` టీజ‌ర్ వేదిక `ఐక‌న్ స్టార్` గా ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బ‌న్ని అభిమానులంతా త‌మ ఫేవ‌రెట్ ని ఐక‌న్ స్టార్ అనేది బావున్నా.. స్టైలిష్ స్టార్ ట్యాగ్ క‌నుమ‌రుగ‌వుతుంద‌ని క‌ల‌త చెందారు. ఐక‌న్ స్టార్ అనేది స్ఫూర్తిని నింపేదిగా ఉన్నా కొంద‌రికి ఇంకా బాగా ఎక్క‌లేదు.

అయితే ఐక‌న్ స్టార్ అనే ట్యాగ్ అస‌లు బ‌న్నీకి ఎవ‌రు ఇచ్చారు? `ఐక‌న్` చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు ఇచ్చారా? లేక ఆ సినిమా క‌థ రాసుకున్న వేణు శ్రీ‌రామ్ ఇచ్చారా? లేక జెన్యూన్ గా అల్లు అర్జున్ అభిమానులే ఆ ట్యాగ్ ఇవ్వాల‌నుకున్నారా? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు బాణాల్లా దూసుకొచ్చాయి.

అస‌లు ఐక‌న్ స్టార్ అనే ట్యాగ్ మీరే ఇచ్చారా? అంటూ నిర్మాత‌ దిల్ రాజును ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఇచ్చిన స‌మాధానం షాకిచ్చింది. ``అది ఆయ‌నే పెట్టుకుంది.. మ‌నం ఇచ్చిన‌ది కాదు!`` అంటూ అస‌లు సంగ‌తి చెప్పేశారు. `ఐక‌న్` అనేది మేం నిర్ణ‌యించిన టైటిల్. ఆ సినిమా క‌థ అద్భుతం. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డింది.. అటూ ఇటూ అయ్యింది త‌ప్ప మంచి క‌థ‌తో రెడీగా ఉన్నామ‌ని బ‌న్ని రెడీ అన‌గానే సెట్స్ కెళ్ల‌డ‌మేన‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. వ‌కీల్ సాబ్ స‌క్సెస్ స‌మావేశంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆ వ్యాఖ్య మాత్రం బ‌న్ని అభిమానుల్ని ఓ రేంజులోనే వెంటాడుతోంది.

అస‌లు త‌మ ఫేవ‌రెట్ స్టార్ కి ఐక‌న్ స్టార్ అని ట్యాగ్ ఇవ్వాల్సింది తాము క‌దా! ఆయ‌న‌కు ఆయ‌నే పెట్టుకోరు క‌దా!! అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కుముందు చిరంజీవి స్టార్ గా ఎదిగే క్ర‌మంలో సుప్రీంహీరో అని పిలిచారు. చిరుని గొప్ప‌గా అభిమానించిన‌ నిర్మాతలు ద‌ర్శ‌కులు అది ఆయ‌న రేంజుకు స‌రిపోతుంద‌ని భావించి ప‌ర్మినెంట్ చేశారు. ఆ త‌ర్వాత మెగాస్టార్ అనేది అభిమానులు నిర్మాత‌లు ఎంతో ఇష్ట‌ప‌డి సృష్టించిన‌ది. ఇరుగు పొరుగు భాష‌ల్లో అయితే తెలుగు సూప‌ర్ స్టార్ అంటూ చిరంజీవిని కీర్తిస్తారు. సైరా-న‌ర‌సింహారెడ్డి ప్ర‌మోష‌న్స్ కోసం చిరు బాలీవుడ్ మీడియా ముందు అడుగుపెట్ట‌గానే ఆ సినిమా ప్రివ్యూ చూసేసిన వాళ్లంతా సెల్యూట్ కొట్టారు. తెలుగు సూప‌ర్ స్టార్ చిరంజీవి ఎంతో అద్భుతంగా న‌టించారు! అంటూ జాతీయ మీడియాలు కీర్తించాయి.

అయితే బన్నీ ఆయ‌నే పెట్టుకోవ‌డమేమిటి? అత‌డిని ఐక‌న్ స్టార్ అని పిలిచేందుకు ఆర్య సుకుమార్ ఎంతో ఇష్ట‌ప‌డ్డారు. అత‌డే పుష్ప వేదిక‌పై దీనిని హైలైట్ చేశారు. క‌నీసం దానిని అయినా దిల్ రాజు త‌న మాట‌ల్లో మెన్ష‌న్ చేయ‌లేదేమిటి? అంటూ ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు క‌ల‌త‌కు గుర‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం రాజుగారి వీడియో బైట్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది.