Begin typing your search above and press return to search.

ఆ స్టార్‌ సినిమాను డిజిటల్‌ వాళ్లు పట్టించుకోవడం లేదట

By:  Tupaki Desk   |   1 Jun 2020 7:50 AM GMT
ఆ స్టార్‌ సినిమాను డిజిటల్‌ వాళ్లు పట్టించుకోవడం లేదట
X
ఈ మద్య కాలంలో కోటి లోపు బడ్జెట్‌ సినిమాలను కూడా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లు పోటీ పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కాస్త పబ్లిసిటీ దక్కి సినిమా నలుగురిలో నానితే సినిమాకు బడ్జెట్‌ కంటే ఎక్కువ రేటు పెట్టేందుకు సైతం సిద్దం అవుతున్నారు. కాని ఒక స్టార్‌ హీరో సినిమాను మాత్రం డిజిటల్‌ స్క్రీనింగ్‌ కు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పాత కొత్త సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓటీటీ వారు కొనుగోలు చేస్తున్నారు.

ఈ స్టార్‌ హీరో సినిమాను 2017లో విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. శాటిలైట్‌ రైట్స్‌ కూడా పెద్దగా రేటు పలకలేదు. వచ్చిన రేటుకు ఇచ్చేసి వదిలించుకున్నారు. ఇప్పుడు డిజిటల్‌ రైట్స్‌ అమ్మడం ద్వారా మరికొంత అమౌంట్‌ వస్తుందని ఆశించారు. గత కొన్నాళ్లుగా సినిమాను అమ్మేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. కాని ఆ సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ వారు ఆసక్తి చూపడం లేదట.

గతంలోనే ఫ్లాప్‌ అయిన సినిమాను మళ్లీ ఇప్పుడు చూస్తారు. ఆ సినిమాపై కనీసం పాతిక లక్షలు పెట్టినా కూడా వృదానే అనే ఉద్దేశ్యంతో అసలు ఎవరు కూడా ఆ సినిమాను పట్టించుకోవడం లేదట. కాని ఆ సినిమా మేకర్స్‌ మాత్రం హీరో స్టార్‌ డంను చూపించి ఆయన గత సినిమాల ట్రాక్‌ రికార్డును చూపించి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఫేమస్‌ సాంగ్‌ లోని పల్లవి పదంను టైటిల్‌ గా పెట్టడంతో అందరి దృష్టి ఆ సినిమా ఆకర్షించింది. ఇప్పుడు ఆ టైటిల్‌ వల్లే ఎవరు ఆసక్తి చూపడం లేదు. టైటిల్‌ కు మంచి హైప్‌ వచ్చి అప్పుడు సినిమా ఫ్లాప్‌ అయిన సంగతి అందరికి గుర్తు ఉంది. కనుక ఇప్పుడు ఎవరు చూడరు అనేది ఓటీటీ వారి అభిప్రాయం. ఇది ఆ హీరోకు తీవ్రంగా కలిచి వేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.