కొత్త హీరోయిన్స్ ఎంట్రీతో వారి ప్లేస్ కు కష్టాలు

Wed Oct 27 2021 05:00:01 GMT+0530 (IST)

Difficulties to their place? with the entry of new heroines

టాలీవుడ్ లో కొత్త రక్తం రావడం.. పాత రక్తం పోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. హీరోయిన్స్ కొత్త వారు వచ్చే వాళ్లు వస్తూనే ఉంటారు. పదుల సంఖ్యలో హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చినా కూడా సక్సెస్ అయ్యేది ఇద్దరు లేదా ముగ్గురు. ఇక హీరోయిన్స్ గా స్టార్ డమ్ ను దక్కించుకునేది మాత్రం కేవలం ఒక్కరు అంటే ఒక్కరే. ఈమద్య కాలంలో టాలీవుడ్ లో మీడియాలో సందడి చేస్తున్న ముద్దుగుమ్మలు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మరియు పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల. వీరిద్దరు కూడా మొదటి సినిమాలతోనే స్టార్ డమ్ దక్కించుకున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం చేతిలో అయిదు ఆరు సినిమాలను పెట్టుకుంది. ఇక శ్రీలీల కూడా అదే మాదిరిగా వరుస సినిమాలకు ఓకే చెప్తూ దూసుకు పోతుంది. అల్లు వారి బ్యానర్ లో శ్రీలీల మూడు సినిమాలకు సైన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.ఈ ఇద్దరు హీరోయిన్స్ ముందు ముందు టాలీవుడ్ టాప్ స్టార్ మీరోయిన్స్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు అంటూ విశ్లేషకులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా.. పూజా హెగ్డే.. సాయి పల్లవి వంటి స్టార్స్ ఉన్నారు. వీరు కాజల్.. సమంత.. తమన్నాల ప్లేస్ లో వచ్చారు. రష్మిక బ్యాచ్ ఫేడ్ ఔట్ అయ్యే సమయంకు శ్రీలీల మరియు కృతి శెట్టిలు టాప్ స్టార్స్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకున్న హీరోయిన్స్ ను టాలీవుడ్ స్టార్ హీరోల ఫిల్మ్ మేకర్స్ కోరుకుంటూ ఉంటారు. కనుక వీరు మరో రెండు మూడు సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకుంటే ఇక వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

ఈ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పొజీషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న లావణ్య త్రిపాఠి.. నభా నటేష్.. నిధి అగర్వాల్.. అను ఎమాన్యూల్.. రాశి ఖన్నా వంటి హీరోయిన్స్ అదే పొజీషన్ లో ఉండి పోవాల్సిందే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప వీరిలో ఎవరైనా మళ్లీ స్టార్ హీరోయిన్ రేసులో నిలుస్తారని అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో టాప్ పొజీషన్ కు శ్రీలీల మరియు కృతి శెట్టి వెళ్లే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. వారిద్దరి వల్ల చాలా రోజులుగా స్టార్ హీరోలకు జోడీగా ఛాన్స్ లను ఆశిస్తున్న నిధి బ్యాచ్ కు నిరాశ తప్పక పోవచ్చు అంటున్నారు.