పాన్ ఇండియా నిర్మాతకు అప్పు పుట్టడం లేదట!

Sun Jan 16 2022 06:00:01 GMT+0530 (IST)

Difficulties For Producer Of Pan India Movie

2021-22 మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆ సినిమాకే ఐడెంటిటీ ఉంది. కానీ సదరు పాన్ ఇండియా సినిమా రిలీజ్ కోవిడ్ వల్ల అంతకంతకు ఆలస్యమైంది. దీంతో నిర్మాతల్లో ఆర్థికంగా క్రైసిస్ స్టార్టయ్యిందని కథనాలొచ్చాయి. ఈ సినిమాకి పెట్టుబడులు పెడుతున్న బడా పారిశ్రామిక వేత్త కం రాజకీయ నాయకుడి నుంచి ఆ నిర్మాతకు పెట్టుబడులు ఆగిపోయాయని గుసగుస వైరల్ అవుతోంది. ఇప్పటికే అసాధారణ బడ్జెట్లు పెట్టగా.. ఇది రిలీజ్ ముందు డైలమాలో ఉంది. ఏప్రిల్ 14 రిలీజ్ తేదీ అంటూ ప్రకటించినా .. అదే డేట్ కి మరో రెండు పెద్ద సినిమాల నుంచి కాంపిటీషన్ ఎదుర్కోవాల్సిన సన్నివేశం నెలకొంది.వీటిలో ఒకటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అదే డేట్ కి వస్తుండడం వల్ల సదరు పాన్ ఇండియన్ మూవీ బాలీవుడ్ కలెక్షన్లకు గండి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు దళపతి విజయ్ నటించిన బీస్ట్ కూడా ఏప్రిల్ 14 తేదీపైనే కన్నేయడంతో ఆ పాన్ ఇండియా మూవీకి తమిళనాడు కేరళలోనూ పంచ్ పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానమైన ఏరియాల్లో థియేటర్లు దొరక్కపోతే ఆ మేరకు కలెక్షన్లకు పంచ్ పడుతుందనే బెంగ ఉంది. ఏదేమైనా ఆ డేట్ కలిసొస్తుందో లేదో చెప్పలేం. ఇప్పటికే ఆర్థిక పరమైన చిక్కులుండగా.. ఆ నిర్మాత నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమాని కూడా వేగంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలకు అసాధారణ బడ్జెట్లు వెచ్చించిన సదరు నిర్మాణ సంస్థకు ఇకపై అప్పు పుట్టక రోడ్ బ్లాక్ అయిపోయిందని గుసగుసల వినిపిస్తున్నాయి.

ఇక ఈ సంస్థకు అప్పులిస్తున్న బడా పారిశ్రామిక వేత్త కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో అది కూడా అప్పు పుట్టకపోవడానికి కారణమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే నెలవ్యవధిలోనే రెండు పాన్ ఇండియా సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వైరల్ అవుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన దిగ్గజ సినీ నిర్మాణ సంస్థ ఎలాగోలా ఫైనాన్సులు క్లియర్ చేయాల్సి ఉంది. దీనంతటికీ కారణం కోవిడ్ అని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.