Begin typing your search above and press return to search.

రవితేజ 'రావణాసుర' కోసం డిఫరెంట్ షూటింగ్ ప్లాన్..?

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:59 PM GMT
రవితేజ రావణాసుర కోసం డిఫరెంట్ షూటింగ్ ప్లాన్..?
X
మాస్ మహారాజా ర‌వితేజ లైన్ లో పెట్టిన అర డజను క్రేజీ ప్రాజెక్ట్స్ లో ''రావ‌ణాసుర'' కూడా ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం సుశాంత్ పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ లో రవితేజ జాయిన్ అవుతారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది.

'రావ‌ణాసుర' సినిమాని అన్ని రియల్ లొకేషన్స్‌ లోనే చిత్రీకరించేలా మేకర్స్ డిఫరెంట్ షూటింగ్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట. ఈ మూవీ కోసం ఎలాంటి స్పెషల్ సెట్లు నిర్మించడంలేదని తెలుస్తోంది. హైదరాబాద్‌ లోని ఉస్మానియా హాస్పిటల్ - సిటీ కాలేజ్ లైబ్రరీ వంటి ప్రముఖ ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ మధ్య కాలంలో ప్రతీ సినిమాకు భారీ సెట్లు వేయడం అనేది కామన్ అయిపోయింది. వీటి కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే ఎక్కువ శాతం షూటింగ్ సెట్స్ లలో చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ రవితేజ 'రావణాసుర' షూటింగ్ కోసం ఏ స్టూడియోకి వెళ్లడం లేదని అంటున్నారు. మరి పాటల కోసమైనా ప్రత్యేక సెట్ల నిర్మాణం చేపడతారేమో చూడాలి.

స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న 'రావణాసుర' చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ అందించారు. ఇందులో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్ - ఫరియా అబ్దుల్లా - మెగా ఆకాష్ - దక్షనాగార్కర్ - పూజిత పొన్నాడ వంటి అయిదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో భాగం అవుతున్నారు. అందులో ఒకరు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు