Begin typing your search above and press return to search.

#లైగ‌ర్.. `త‌డ‌బాటు` కాసులు కురిపించే మంత్ర‌మా?

By:  Tupaki Desk   |   23 Sep 2021 4:46 AM GMT
#లైగ‌ర్.. `త‌డ‌బాటు` కాసులు కురిపించే మంత్ర‌మా?
X
పాత్ర‌ల ఆహార్యం ఒక్కోసారి క‌నెక్టయితే సినిమా లెవ‌లే మారిపోతుంది. నిజానికి ఒక మంచి పాత్ర‌ను డిజైన్ చేసుకున్న త‌ర్వాత దాని చుట్టూ క‌థ‌లు అల్లే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు లేక‌పోలేదు. ఈ కోవ‌కే చెందుతారు పూరి జ‌గ‌న్నాథ్. ఆయ‌న తొలుత హీరో పాత్ర‌ను డిజైన్ చేస్తారు. దానిని బ‌ట్టి అద్భుత‌మైన క‌థ‌ను అల్లుకోగ‌ల‌రు. దాని చుట్లూ వండ‌ర్స్ చేసే సంభాష‌ణ‌ల్ని స‌మ‌కూర్చి క‌మ‌ర్షియ‌ల్ గా ఎన్నో అద్భుతాలు చేసిన చ‌రిత్ర పూరీకి ఉంది.

ఇప్పుడు ఇదే ఫార్ములాని విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ కి పూరి ఆపాదించారు. లైగ‌ర్ టైటిల్ .. క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ కి త‌గ్గ‌ట్టే విజ‌య్ పాత్ర‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బాక్సింగ్ నేప‌థ్యాన్ని ఎంచుకుని హీరో పాత్ర‌కు ఒక చిన్న ట్విస్టుని లాజిక్కుని యాడ‌ప్ చేసి పూరి ఫుల్ మ్యాజిక్ నే ప్లాన్ చేశార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇంత‌కీ హీరో పాత్ర‌లో ట్విస్టేమిటి? అంటే...విజయ్ దేవరకొండ పాత్రకు తడబాటు సమస్య ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇది ఎలాంటిది అంటే... క‌మ‌ల్ హాస‌న్ సినిమాల్లో రెగ్యుల‌ర్ గా చూసే ఒక డిఫ‌రెంట్ టోన్ ఆహార్యంతో ఉంటుంద‌ట‌.

ఇటీవ‌ల రంగ‌స్థ‌లంలో చెవిటి చిట్టిబాబు పాత్ర‌తో సుకుమార్ ప్ర‌యోగం చేశారు. పుష్ప‌లో బ‌న్ని పాత్ర‌ను ప్ర‌యోగాత్మ‌కంగా చూపించ‌నున్నారు సుకుమార్. భుజానికి గాయం అయిన పుష్ప‌రాజ్ కాస్త గూని అవ‌తారంతో స‌ర్ ప్రైజ్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అదే తీరుగా ఇప్పుడు పూరి ప్ర‌యోగం చేస్తున్నాడు. త‌న ఇస్మార్ట్ శంక‌ర్ కి మ‌తిమ‌రుపు రీకాలింగ్ ఇష్యూస్ ని జ‌త చేసిన పూరి ఇప్పుడు లైగ‌ర్ కి ఒక ప్ర‌త్యేక ల‌క్షణం యాడ్ చేశార‌ట‌. జై లవకుశలో ఎన్టీఆర్ పాత్ర‌కు న‌త్తి ఉంటుంది. మాట తీరు త‌డ‌బ‌డుతుంది. ఇప్పుడు అలానే లైగ‌ర్ లో విజ‌య్ పాత్ర‌కు త‌డ‌బాటు ల‌క్ష‌ణాన్ని ఆపాదించార‌ని తెలిసింది.

నిజానికి ఏ అవ‌ల‌క్ష‌ణం అనారోగ్యం లేని గొప్ప కుర్రాడిని తెర‌పై చూపించ‌డం క‌ష్ట‌మేమీ కాదు కానీ.. ఇలా ఏదో ఒక తేడా ఉన్న వాడిని తెర‌పై చూపించ‌డం అంటే అది క‌త్తి మీద సామే. కానీ దానిని పూరి-విజ‌య్ టీమ్ స‌వ్యంగానే ఆవిష్క‌రిస్తార‌నేది అభిమానుల న‌మ్మ‌కం. లైగ‌ర్ కేవ‌లం యాక్ష‌న్ బేస్డ్ సినిమా మాత్ర‌మే కాదు. ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ కి సంభాష‌ణ‌ల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది. పెర్ఫామెన్సెస్ ప‌రంగా మ‌రో లెవ‌ల్ ని చూపించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోల రేంజును చేరుకుంటాడ‌ని అంతా భావిస్తున్నారు. ఆర్జీవీ ముందే చెప్పిన‌ట్టు విజ‌య్ ఒక స్టార్ హీరో రేంజుకు ఎందులోనూ త‌గ్గ‌డ‌నే ప్ర‌స్తుతానికి భావిస్తున్నారు. అయితే దేవ‌ర‌కొండ ఎంత బాగా న‌టించినా కానీ లైగ‌ర్ అన్ని భాష‌ల్లో విజ‌యం సాధించిన‌ప్పుడే అది స‌వ్యంగా ఫ‌లించిన‌ట్టు.

లుక్ ప‌రంగా ఊహించ‌ని మేకోవ‌ర్

విజ‌య్ ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ ఖాయంగానే కనిపిస్తోంది. లైగ‌ర్ లో లుక్ ప‌రంగా అత‌డు నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా క‌నిపించ‌నున్నాడు. ఇన్నేళ్ల‌లో ఎంద‌రో హీరోల‌ను లుక్ ప‌రంగా అమాంతం మార్చేసిన పూరి జ‌గ‌న్నాథ్ ఇప్పుడు లైగ‌ర్ చిత్రంతో దేవ‌ర‌కొండ‌ను కూడా అంతే గొప్ప‌గా మార్చేశాడు. లైగ‌ర్ అన్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే అత‌డిలోని క్రాస్ బ్రీడ్ ని బ‌య‌ట‌పెడుతున్నాడు. కండ‌లు మెలితిరిగిన దేహంతో పిల‌క‌ముడితో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అలా రింగ్ లో రిలాక్స్ డ్ గా కూర్చుని ప్రాక్టీస్ సెష‌న్స్ ని వీక్షిస్తున్నట్టే క‌నిపిస్తోంది.

మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్టిస్టుగా దేవ‌ర‌కొండ లుక్ ని ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా అభిమానుల్వో లైర‌ల్అయ్యింది. రింగ్ లోకి దిగాక శ‌త్రువును ఆడుకునే లైగ‌ర్ స్టైల్ పై అభిమానుల్లో అంచ‌నాలున్నాయి. పూరి ఈ సినిమాని నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా తెర‌కెక్కిస్తార‌నే అంతా ఆశిస్తున్నారు. ఇంత‌కుముందు అన‌న్య పాండే డాడీ చుంకీ పాండే నేరుగా దేవ‌ర‌కొండ లుక్ ని హార్డ్ వ‌ర్క్ ని ఎంత‌గానో ప్ర‌శంసించాడు. అంత‌కుముందు ఆర్జీవీ సైతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి దేవ‌ర‌కొండ త‌క్కువేమీ కాదు అంటూ కితాబిచ్చేశారు. అందుకే విజ‌య్ లుక్ రాగానే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న త‌ప‌న‌తో ఉన్న పూరి ప్ర‌స్తుతం ఆ ప‌నిలో ఉన్నాడు. ఛార్మి టీమ్ కి అవ‌స‌ర‌మైన సాయం చేస్తున్నారు. ఇక వియ్ ని బాలీవుడ్ లో మ‌రో లెవ‌ల్ లో ఆవిష్క‌రించేందుకు గురుడు క‌ర‌ణ్ జోహార్ చేయాల్సిన‌దంతా చేస్తున్నారు. ఓవ‌రాల్ గా తెలుగు-త‌మిళం-హిందీలో లైగ‌ర్ తో విజ‌య్ కాక‌లు పుట్టిస్తాడ‌నే అంచ‌నా వేస్తున్నారు. సౌత్ అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అనువాద‌మై రిలీజ్ కానుంది.