మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా మూవీ హీరో దర్శకుడి మధ్య విభేదాలు

Sat Dec 03 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Differences between Most Crazy Pan India Movie Hero Director

ప్రస్తుతం సౌత్ ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రెండు మూడు ఉన్నాయి. ఆ రెండు మూడు సినిమాల్లో ఒక సినిమా హీరో మరియు దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిత్ర దర్శకుడు ఇండస్ట్రీ హిట్ సినిమాను అందించి ఇప్పుడు ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ ను అందించాలని భావిస్తున్నాడుమరో వైపు హీరో మాత్రం పలు సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల ఈ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించడం లేదట. పైగా కేటాయించిన డేట్లలో కూడా సరిగా షూట్ కు హాజరు కాకపోవడం తో పాటు లేజీగా వ్యవహరిస్తూ దర్శకుడి యొక్క సహనానికి పరీక్ష పెడుతున్నాడట. షూటింగ్ ను ఎంత త్వరగా పూర్తి చేసి సినిమాను విడుదల చేద్దామా అంటూ ఆ దర్శకుడు ఎదురు చూస్తున్నాడు.

మరో వైపు హీరో మాత్రం చేద్దాం లే.. చూద్దాం లే అన్న ధోరణిలో ఉన్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ దర్శకుడు మరో స్టార్ హీరోతో సినిమా ను కమిట్ అయ్యాడు.

ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చేయాలని భావించాడు.

కానీ ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆ సినిమా ఎప్పటికి మొదలు పెట్టేది అర్థం కావడం లేదు. పైగా ఈ సినిమా యొక్క బడ్జెట్ విపరీతంగా పెరగడం తో దర్శకుడిపై ఒత్తిడి పెరుగుతుందట. గత సినిమా తో దక్కిన లాభం ఈ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల కోల్పోవాల్సి వస్తుందని దర్శకుడు మరియు నిర్మాణ సంస్థకు చెందిన వారు అసహనంతో ఉన్నారట.

ఈ క్రేజీ సినిమాను రెండు పార్ట్ లుగా అనుకున్నా హీరో యొక్క తీరుతో ఒక్క పార్ట్ కే ముగించేద్దాం అని దర్శకుడు నిర్ణయానికి వచ్చాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరియు దర్శకుడు కూడా ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్నారే. ఇద్దరు సమన్వయంతో ముందుకు సాగితే మంచి సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇలా విభేదాలతో ఆ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.