Begin typing your search above and press return to search.

రానా పెళ్లిలో అక్కినేని కోడ‌లు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌ చూశారా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 7:00 AM GMT
రానా పెళ్లిలో అక్కినేని కోడ‌లు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌ చూశారా?
X
హ్యాండ్ టు హ్యాండ్ .. ఫేస్ టు ఫేస్ .. చూస్కుందామా నీ పెతాప‌మూ నా పెతాప‌మూ? ఇలాంటి డైలాగులు కేవ‌లం సినిమాల్లోనే కాదు.. అప్పుడ‌ప్పుడు పెళ్లిళ్ల‌లోనూ కుదురుతుంది! అయితే ఇక్క‌డ కాస్త ఫ‌న్నీగా క‌డుపుబ్బా న‌వ్వించేలా? ఇలాంటి బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు బ‌య‌ట‌ప‌డుతుంటాయి.

మొన్న‌టికి మొన్న భ‌ళ్లాల‌దేవ రానా పెళ్ల‌య్యింది. రామానాయుడు స్టూడియోస్ లో ఈనెల 8న జ‌రిగిన ఈ వేడుక‌లో రానా క‌జిన్ స‌మంత సంద‌డి గురించి తెలిసిందే. ఖ‌రీదైన త‌ళుకుబెళుకుల డిజైన‌ర్ డ్రెస్సుల్లో స‌మంత పెళ్లి వేడుక‌కే వ‌న్నె తెచ్చారు. అక్క‌డితో అయిపోలేదు. వేదిక అంతా క‌లియ తిరిగేస్తూ సామ్ హ‌డావుడి చేయ‌డ‌మే కాదు.. కుర్చీలో కూచుని ఏకంగా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు రెడీ అయ్యింది.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో తాజాగా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. చుట్టాల‌తో హ్యాండ్ రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న సామ్ త‌న బ‌లాన్ని ఎలా ప్ర‌ద‌ర్శిస్తోందో చూశారుగా.. ఆ వెన‌క‌నే రానా .. నాగ‌చైత‌న్య కూడా తెగ ఎంక‌రేజ్ చేస్తూ క‌నిపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. సమంతకు లేని టాలెంటా? అంటూ ఫ‌న్నీగా ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఫ్యామ‌లీ మ్యాన్ సీజ‌న్ 2లోనూ స‌మంత ఇచ్చే ట్విస్టుకి అభిమానులు ఔరా! అన‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌మాద‌క‌ర తీవ్ర‌వాదిగా సామ్ న‌ట‌న‌కు మంత్ర ముగ్ధం అయిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్రియ‌మ‌ణి ప‌లు ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.