Begin typing your search above and press return to search.

కంగనా సినిమానే సాయి పల్లవి మొదటి సినిమా అని మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   10 May 2021 3:30 AM GMT
కంగనా సినిమానే సాయి పల్లవి మొదటి సినిమా అని మీకు తెలుసా?
X
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉంటారు. కాని కొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటారు. అందరు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ గా కొనసాగుతూ ఉంటారు. హీరోల పక్కన గ్లామర్ డాల్స్ గా నటించే వారు ఎక్కువ మంది ఉంటారు. కాని కొద్ది మంది మాత్రమే పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తామంటూ భీష్మించుకు కూర్చుంటారు. అందులో సాయి పల్లవి ఒకరు అనడంలో సందేహం లేదు. డాన్సర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన మల్టీ ట్యాలెంటెడ్‌ సాయి పల్లవి ప్రస్తుతం సౌత్‌ లోనే టాప్‌ స్టార్‌ హీరోయిన్‌. స్కిన్‌ షో చేయకుండా పద్దతిగా నటిస్తూ తన నటనతో స్టార్‌ డం దక్కించుకున్న హీరోయిన్‌ సాయి పల్లవి. ఈమె పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు మీకోసం..

సాయి పల్లవి బాల నటిగా చాలా సినిమాల్లో కనిపించింది. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ సీజన్‌ 4 లో పాల్గొంది. 2008 సంవత్సరంలోనే సాయి పల్లవి తెలుగు వారికి పరిచయం అయ్యింది. ఆ సమయంలో ఆమె డాన్స్ కు ఫిదా అయ్యారు తప్ప ఈ స్థాయికి చేరుతుందని మాత్రం ఊహించలేదు. సాయి పల్లవి ఆ తర్వాత పలు డాన్స్ షోల్లో కనిపించింది. బాల నటిగా నటించిన సాయి పల్లవి ఒక పూర్తి స్థాయి నటిగా మాత్రం 2008 సంవత్సరంలో నటించింది. ధామ్‌ ధూమ్‌ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌ కు స్నేహితురాలి పాత్రలో కనిపించింది.

ధామ్‌ ధూమ్‌ సినిమాలో హీరోయిన్ గా కంగనా రనౌత్‌ నటించింది. కంగనాతో కలిసి దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌ లో సాయి పల్లవి పాల్గొందట. సినిమా టైటిల్‌ కార్డ్స్ లో సాయి పల్లవి పేరును కూడా వేయలేదు. అంతకు ముందు పలు సినిమాలు బాల నటిగా చేసినా కూడా నటిగా మాత్రం కంగనా హీరోయిన్‌ గా నటించిన సినిమానే అంటూ సాయి పల్లవి చెప్పుకుంటూ ఉంటుంది. ఎక్కువ శాతం సినిమాల్లో మేకప్ లేకుండానే నటించేందుకు ఆసక్తి చూపించే సాయి పల్లవి మేకప్ వేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా రెండు కోట్ల పారితోషికం ఆఫర్‌ చేసినా ఒక ఫెయిర్‌ నెస్‌ క్రీమ్‌ కు అంబాసిడర్ గా చేసేందుకు నిరాకరించింది. అలా సాయి పల్లవి తనకంటూ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవికి మా.. మీ.. తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.