ఆ సంగతి మరచిపోయారా మహేషా?

Sat May 28 2022 23:00:01 GMT+0530 (IST)

Did you forget that Mahesh?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయలేనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసింది అని ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఆ కలెక్షన్స్ పై కూడా అనేక రకాల భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.ఆ సంగతి పక్కన పెడితే సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు మర్చిపోవడం తో అభిమానులు సోషల్ మీడియా ద్వారా పదే పదే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమాలో 'మా మా మహేషా' అనే పాట మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ తో మహేష్ చేసిన డాన్స్ స్టెప్పులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ మాస్ సాంగ్ కంటే ముందు మురారి బావ అని ఒక పాటను కూడా అనుకున్నారు. దర్శకుడు అది వద్దని దాని ప్లేస్ లో మా మా మహేషా అనే పాట చేద్దామని ఆలోచన కు వచ్చాడు.

ఆ విషయాన్ని మహేష్ బాబు ఇంటర్వ్యూ లలో కూడా తెలియజేశాడు. అయితే ఆ పాటను సినిమాలో మళ్లీ యాడ్ చేస్తామని కూడా అన్నారు. అయితే ఇంతవరకు చిత్రయూనిట్ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి అవుతున్న కూడా కనీసం అప్డేట్ కూడా లేదు. బహుశా కలెక్షన్స్ చాలావరకూ తగ్గిపోవడంతో సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.

దీంతో ప్రేక్షకులు మురారి బాబా పాటలు కూడా సినిమాలో యాడ్ చేయాలని సోషల్ మీడియాలో నినాదాలను వినిపిస్తున్నారు. ఇంతవరకు చిత్ర యూనిట్ వారి వివరణ పై ఒక్క క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31వ తేదీన అయినా విడుదల చేస్తారో లేదో చూడాలి. ఇక మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాడు.