టాలీవుడ్ టాప్ హీరో.. సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్నాడా?

Mon Jul 26 2021 13:42:46 GMT+0530 (IST)

Tollywood Top Hero  Did the Psychiatrist Take Treatment?

తెలుగు సినీ ఇండస్ట్రీ.. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. తెలు గు ఇండస్ట్రీలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న.. ఓ `పెద్ద` కుటుంబానికి చెందిన యువ హీరో.. టాప్ రేంజ్‌లో ఉన్న కథానాయకుడు ఇటీవల విదేశాలకువెళ్లి.. మానసిక చికిత్స చేయించుకున్నాడని.. పెద్ద ఎత్తున గుసగుస వినిపిస్తోంది. దీనికి ఒక రీజన్ కూడా టాలీవుడ్ లో ప్రచారంలో ఉంది.అదేంటంటే.. సదరు హీరో.. నటించిన చాలా చిత్రాలు హిట్టయ్యాయి. కొన్ని సూపర్ డూపర్ హిట్లు కూడా నమోదు చేసుకున్నాయి. అయితే.. ఇటీవల విడుదలైన ఓ చిత్రం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందట. దీంతో ఈ ఫ్లాప్‌ను ఆయన జీర్ణించుకోలేక పోయారని.. మానసికంగా కొన్ని రోజులు కుంగిపోయారని.. కనీసం బయట కు కూడా రాలేక పోయారని.. ఎన్నో అంచనాలతో తన హావ భావాలను.. శారీరక సౌష్టవాన్ని కూడా మార్చుకు ని.. ఆ మూవీలో ఆయన నటించాడట.

అయితే.. అనుకున్న విధంగా ఆ మూవీ సక్సెస్ కాలేదు. దీంతో హర్టయిన హీరో.. మానసికంగా దిగులు పెట్టుకుని చాలా రోజులు కోలుకోలేక పోయారని.. ఈ క్రమంలోనే కుటుంబ `పెద్ద`ల సూచనల మేరకు ఆయన విదేశాలకు వెళ్లి.. అక్కడ మానసికంగా.. ట్రీట్‌మెంట్ చేయించుకున్నారని.. చికిత్సలో భాగంగా కొన్ని నెలలు ఆయన విదేశాల్లోనే ఉండిపోయారని అంటున్నారు. ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి మరీ సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ చేయించుకున్నారని.. టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో.. తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.