నయన్ కి హనీమూన్ కోసం బ్రేకిచ్చాడా?

Wed Jun 29 2022 10:03:13 GMT+0530 (IST)

Did nayanthara break for the honeymoon

ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లాడిన నయనతార గత కొంతకాలంగా విదేశీ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త పెళ్లి కూతురు తన సోషల్ మీడియాల్లో హనీమూన్ ట్రిప్ నుంచి వరుస ఫోటోలను షేర్ చేయగా అవన్నీ వైరల్ గా మారాయి. ప్రియుడితో నయన్ ఎంతో రొమాంటిగ్గా కనిపించింది.అయితే ఇది చాలా చిన్న ట్రిప్ మాత్రమే. ఇంతలోనే నయన్ తిరిగి బ్యాక్ టు వర్క్ అంటూ షూటింగులో జాయిన్ అయ్యింది. జవాన్ చిత్రీకరణలో షారూక్ తో పాటు బిజీ అయిపోయింది.

నిజానికి  నయనతార హనీమూన్ ట్రిప్ కోసమే షారూక్ చిన్న పాటి బ్రేక్ ఇచ్చారా? అన్న గుసగుసా ఇప్పుడు వినిపిస్తోంది. అలా హబ్బీతో హనీమూన్ యాత్రను ముగించి ఇలా వచ్చేయగా ఈ కొత్త సందేహం రాజుకుంది.

జవాన్ షెడ్యూల్ ని నాన్ స్టాప్ గా పూర్తి చేయాలనుకున్న ఖాన్ ఇంతలోనే నయనతార కోసం బ్రేకిచ్చాడు. తన షెడ్యూల్ మార్చుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. నిజానికి గడిచిన దశాబ్ధంలో ఒక సౌత్ అగ్ర హీరోయిన్ తో ఖాన్ నటించడం కూడా ఇదే మొదటి సారి. పైగా నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ సరసన నటిస్తున్నాడు. ఒక సీనియర్ నటీమణిగా నయన్ కి షారూక్ ఎంతో గౌరవం ఇస్తున్నారని భావించాలి.

జవాన్ షూటింగ్ గత వారం ప్రారంభం కావాల్సి ఉన్నందున  హనీమూన్ ట్రిప్ ను క్యాన్సిల్ చేయాలనుకున్న నయన్ కోసం ఖాన్ చాలా ఆలోచించారని గుసగుస వినిపిస్తోంది. షారూఖ్ ఖాన్ తన కాల్ షీట్లను సర్దుబాటు చేశాడు. దానివల్లనే చిన్న హనీమూన్ ట్రిప్ ను కొత్త జంట ఎంజాయ్ చేయగలిగింది. నూతన వధూవరులు విఘ్నేష్ శివన్- నయనతార థాయ్ లాండ్ లో హనీమూన్ యాత్రను ఆస్వాధించారు.

ఆదివారం నాడు నయన్ తిరిగి భారత్ కు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ముంబైలో జవాన్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఇక జవాన్ తో పాటు నయనతార పలు చిత్రాలకు కమిటైంది. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నయన్- విఘ్నేష్ సొంతంగా ఒక బ్యానర్ ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారని కూడా టాక్ ఉంది.