అతడి వల్ల సల్మాన్ హీరో అయ్యాడు

Mon May 20 2019 23:00:01 GMT+0530 (IST)

Did Vivek Oberoi just take a dig at Salman Khan

ఒక పెద్ద గీత మీద అంతకంటే పెద్ద గీత గీస్తే మొదటిది చిన్న గీత అయిపోతుంది. ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ అనే పెద్ద గీత ముందు.. సల్మాన్ ఖాన్ ఈ రకంగానే చిన్న గీత అయిపోయాడు. ఒకప్పుడు వీళ్లిద్దరూ ఐశ్వర్యారాయ్ తో ప్రేమాయణం నడిపిన వాళ్లే. ఆమె కోసం గొడవకు కూడా దిగారు. ఐతే సల్మాన్ వల్ల ఐష్ చాలా ఇబ్బంది పడిందని.. ఆమెను అతను టార్చర్ చేశాడని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ రకంగా సల్మాన్ బ్యాడ్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అతడి వ్యక్తిగత జీవితంలో వేరే వివాదాలు కూడా ఉన్నాయి కాబట్టి సల్మాన్ కు ఎప్పుడూ ఆ ఇమేజ్ కొనసాగుతూనే ఉంది. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి సల్మాన్ హీరో అయిపోయాడు. ఐష్ విషయంలో అతడిని చాలా మంచి వాడిగా కీర్తించేస్తున్నారు నెటిజన్లు.వివేక్ ఒబెరాయ్ తాజాగా చేసిన ఒక ట్వీట్ పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఐష్ సల్మాన్ తో ఉన్నప్పటి చిత్రం మీద *ఒపీనియన్ పోల్* అని.. వివేక్ తో ఉన్నప్పటి ఫొటో మీద *ఎగ్జిట్ పోల్* అని.. ఇప్పుడు అభిషేక్ - కూతురితో కలిసున్న చిత్రం మీద *రిజల్ట్* అని ఉన్న ఒక మీమ్‌ను అతను షేర్ చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్న ఐష్ గురించి ఇప్పుడు ఇలాంటి ట్వీట్ వేస్తావా అంటూ వివేక్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఐతే సందట్లో సడేమియా అన్నట్లు సల్మాన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. వివేక్ ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో చూశారా.. మా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఐష్ గురించి ఒక్క మాట అన్నది లేదు.. ఆమెను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు.. అతను బంగారం అంటూ కీర్తనలు అందుకున్నారు. కానీ సల్మాన్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నంత కాలం ఐశ్వర్య నరకం చూసిందన్నది బాలీవుడ్ జనాలు చెప్పే మాట.