వినాయక్ ఆయన్ని మర్చిపోయారేమో?

Tue Oct 15 2019 07:00:01 GMT+0530 (IST)

దర్శకులు హీరోలు కావడం పరిశ్రమకు కొత్తేమి కాదు కానీ మరీ రెగ్యులర్ గా అందరూ అయితే అలా ట్రై చేసిన వాళ్ళు కాదు. రాజమౌళి పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తల్లో ఒడ్డు పొడవు ముఖకవళికలు అన్ని ఓ నటుడికి కావలసినట్టుగానే ఉండేవి. ఇప్పుడూ మేకప్ వేస్తే ఓ మోస్తరుగా బాగానే కనిపిస్తాడు జక్కన్న. కానీ తన లక్ష్యం కేవలం దర్శకత్వం కాబట్టి ఏనాడూ ఆ కోణంలో పొరపాటున కూడా ఆలోచించలేదు. ఒకటి రెండు  ఇతర దర్శకుల సినిమాల్లో నటించినా కూడా ఒక్క సీన్ కే పరిమితమయ్యారు.ఇప్పుడు వినాయక్ సీరియస్ గా హీరోగా చేస్తుండటం గురించి పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. సీనయ్య పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్  పోస్టర్లు ఇటీవలే విడుదల చేయగా మిశ్రమ స్పందన లభించింది.  అయితే గతంలో ఇదే తరహాలో మంచి ఫామ్ లో ఉన్న ఓ దర్శకుడు హీరో కావాలనే ప్రయత్నంలో విఫలం కావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

90వ దశకంలో కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఎస్వి కృష్ణారెడ్డి ఉగాది - అభిషేకం అనే రెండు సినిమాలు చేస్తే పూర్తిగా డిజాస్టర్ అయ్యాయి. దెబ్బకు కొంత గ్యాప్ తీసుకుని దర్శకుడిగానే తమిళ రీమేక్ పెళ్ళాం ఊరెళితేతో మళ్ళీ కం బ్యాక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వినాయక్ డైరెక్టర్ గానూ ఫామ్ లో లేడు. హీరోగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వారు వర్క్ అవుట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడీ తిప్పలు అవసరమా అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. వీటికి సమాధానం దొరకాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే