షాలిని పాండేని టాలీవుడ్ లైట్ తీసుకున్నట్లేనా?

Wed May 25 2022 06:00:01 GMT+0530 (IST)

Did Shalini Pandey take on the Tollywood light

తొలి సినిమా `అర్జున్ రెడ్డి` హిట్ తోనే ముంబై బ్యూటీ షాలిని పాండే తెలుగు నాట ఫేమస్ అయింది. కానీ అమ్మడి కెరీర్ అటుపై ఆశించిన  విధంగా  సాగలేదు. అనుకున్నంత బిజీ నటి కాలేకపోయింది.  అవకాశాలైతే వచ్చాయి గానీ వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో  వైఫల్యం కనిపిస్తుంది. `మహానటి`..` ఎన్టీఆర్ కథానాయకుడు` లాంటి చిత్రాల్లో పార్ట్ టైమ్ నటిగా పనిచేసింది.అటుపై  అటుపై `118`.. `ఇద్దరి లోకం ఒకటే`..`నిశ్శబ్దం` లాంటి  సినిమాల్లో నటించింది. కానీ ఇవేవి షాలినికి  అంతగా గుర్తింపు తీసుకురాలేదు. మధ్య మధ్యలో కోలీవుడ్ ని టచ్ చేసింది. అక్కడా కొన్ని సినిమాలు చేసింది. కానీ తమిళ్ లో కూడా అంత ఫేమస్ కాలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్..కోలీవుడ్ లో షాలిని పరిస్థితి ఒకేలా  ఉందని చెప్పొచ్చు.

షాలిని పాండే సౌత్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. చివరిగా `నిశ్శబ్ధం` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగు..తమిళ్ లో అవకాశాలే రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం `మహారాజా` అనే చిత్రంలో నటిస్తుంది. చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఇది. దీంతో అమ్మడి ఆశలన్ని ఈ సినిమాపైనే కనిపిస్తున్నాయి.

హిట్ అయితే మరో ఛాన్స్ లేదంటే? అక్కడా ఖాళీ అయినట్లేనన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఇటీవలే అమ్మడు నటించిన మరో హిందీ చిత్రం `జయేష్ భాయ్ జోర్డన్` భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందకొచ్చి చతికిల పడిన సంగతి  తెలిసిందే. రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది కానీ పనవ్వలేదు. ఈ నేపథ్యంలో షాలిని బాలీవుడ్ కెరీర్ ని నిర్దేశించే చిత్రంగా `మహారాజా` ని చెప్పొచ్చు.

ఇంత  గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో అవకాశాలు రావడం కూడా కష్టమే. అసలే యువ నాయికల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముంబై   మోడల్స్..బెంగుళూరు బ్యూటీలు..మాలీవుడ్ భామలు దిగుమతి అవుతూనే ఉన్నారు. టాలీవుడ్ కూడా ఇటీవలి కాలంలో  నేచురల్ బ్యూటీలకి  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల  నడుమ షాలిని అవకాశాలు అందుకోవాలంటే అద్భుతాలే జరిగాలి.

ఇక షాలిని సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు హాట్ ఫోటోలతో టచ్ లో  ఉంటుంది. ఆ రకంగా యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. తాజాగా క్లీవేవ్ అందాల్ని హైలైట్ చేస్తూ మరో ఫోటోతో  ముందుకొచ్చేసింది. లైట్  బ్లూ కలర్ జీన్స్ లో..టాప్ లో వైట్ కలర్ షర్ట్ లోపల లో దుస్తుల్లో క్లీవేజ్ అందాల ప్రదర్శన హైలైట్. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.