కరోనా కారణంగా నాని 'టక్ జగదీష్' షూటింగ్ ఆపేసారా...?

Sun Oct 18 2020 06:00:05 GMT+0530 (IST)

Did Nani stop shooting Tuck Jagdish due to Corona ...?

కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ మేకప్ వేసుకొని సెట్స్ లో అడుగుపెట్టారు. టాలీవుడ్ లో సైతం షూటింగుల సందడి షురూ అయింది. కేంద్రం ఎప్పుడో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెనుకడుగు వేశారు. ఇప్పటికే ఏడున్నర నెలలకు పైగా సినిమాపై ఆధారపడి జీవిస్తున్నవారు తీవ్ర ఇబ్బదులు పడుతుండటంతో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సేఫ్టీ మెజర్స్ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ ప్రారంభిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''టక్ జగదీష్'' యూనిట్ సభ్యుడికి కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి.నాని 'టక్ జగదీష్' షూటింగ్ హైదరాబాద్ లో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మూవీ టీమ్ చిత్రీకరణ చేశారు. నాని - రీతూ వర్మ పాల్గొంటున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు యూనిట్ లోని ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చిత్ర యూనిట్ ప్రకటన చేసి ఈ వార్తలపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కాగా 'టక్ జగదీష్' చిత్రానికి 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.