స్టార్ డైరెక్టర్ కోసం మహేష్ అలాంటి నిర్ణయం తీసుకున్నారా...?

Sun Jul 12 2020 12:20:00 GMT+0530 (IST)

Did Mahesh make such a decision for Star Director ...?

స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి 'మున్నా' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'బృందావనం' 'ఎవడు' 'ఊపిరి' 'మహర్షి' చిత్రాలను తెరకెక్కించాడు. 13 ఏళ్ళ సినీ కెరీర్ లో కేవలం 5 సినిమాలు మాత్రమే తీసాడంటేనే అర్థం చేసుకోవచ్చు వంశీ పైడిపల్లి స్లో అండ్ స్టడీగా సినిమాలు తీస్తున్నారని. వంశీ సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచినప్పటికీ అవకాశాలు మాత్రం ఆ రేంజ్ లో రావట్లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా 'మహర్షి' సూపర్ సక్సెస్ అయినా వంశీ పైడిపల్లి మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో తదుపరి సినిమా కూడా మహేష్ తో ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అది పట్టాలెక్కలేదు. ఇక మహేష్ నెక్స్ట్ సినిమా 'సర్కారు వారి పాట' పరశురామ్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసారు. దీంతో వంశీ పైడిపల్లి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే అని అర్థం అయింది. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి కి ఫైనల్ గా హీరో దొరికాదంట. తన 'ఎవడు' హీరో రామ్ చరణ్ తోనే తదుపరి సినిమా చేయనున్నాడట.ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు నిర్మాతగా మారుతున్నాడట. మహేష్ తన సొంత బ్యానర్ లో చెర్రీ హీరోగా ఈ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు - రామ్ చరణ్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ స్నేహం కారణంగానే చరణ్ తో మహేష్ బాబు మూవీని నిర్మించబోతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన స్ర్కిఫ్ట్ ఇప్పుడు చరణ్ తో తీస్తున్నారట. రామ్ చరణ్ ఈ స్క్రిప్ట్ కి సూట్ అవుతాడని.. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానని మహేష్ హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అంటే చరణ్ హీరోగా మహేష్ నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోందన్నమాట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.