పిక్ టాక్ : ముద్దుగుమ్మల బైక్ సాహస యాత్ర

Fri Jul 01 2022 10:00:01 GMT+0530 (IST)

Dia Mirza Fatima Sana Shaikh Ratna Pathak at ladakh

హిందీ సినిమా 'ధక్ ధక్' షూటింగ్ ను లఢక్ కొండ ప్రాంతంలో జరుపుతున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీ అయిన ధక్ ధక్ షూటింగ్ కోసం హీరోయిన్స్ దియా మీర్జా.. ఫాతిమా సనా షేక్.. రత్నా పాఠక్ లు అత్యంత సాహస యాత్ర చేసుకుంటూ లఢక్ ప్రాంతంలోని ఖర్దుంగ్‌లా కి చేరుకున్నారు. ఈ సాహస యాత్ర గురించి దియా మీర్జా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.వయాకాం 18 సంస్థతో కలిసి హీరోయిన్ తాప్సి ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా తాహిరా కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా లేడీ టీమ్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా బాలీవుడ్ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతూ ఉంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ నుండి ఏకంగా ఖర్దుంగ్‌లా కు ముద్దుగుమ్మల సాహస యాత్ర చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.

దియా మీర్జా ఈ సాహస యాత్ర గురించి మాట్లాడుతూ.. ధక్ ధక్ సినిమా షూటింగ్ కోసం ఖర్దుంగ్‌లా కు చేరుకున్నాం. బైక్ మీద ఈ యాత్ర చేస్తున్న సమయంలో మేము ఈ యాత్రను పూర్తి చేస్తామా అనే అనుమానం కలిగింది. ఇంత కష్టపడి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ షెడ్యూల్ అద్బుతంగా వస్తుందనే నమ్మకం ను ఆమె వ్యక్తం చేసింది.

ధక్ ధక్ సినిమా విడుదల అయిన తర్వాత మేము ఇంత కష్టపడి ఖర్దుంగ్‌లా కు ఎందుకు వచ్చి షూటింగ్ చేయాల్సి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత కష్టపడుతున్నది కూడా మీకు తెలుస్తుంది అన్నట్లుగా దియా మీర్జా చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ ఇంత కష్టపడి బైక్ పై అంత దూరం వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.

సినిమా కోసం.. వారు కథ మరియు స్క్రిప్ట్ పై పెట్టుకున్న నమ్మకం కారణంగానే ఇది సాధ్యం అయ్యింది అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా షూటింగ్ ను త్వరలోనే ముగించి విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తాజాగా తెలియజేశారు.