టోటాక్ : క్రికెట్ మెగా 'గాడ్ ఫాదర్' వేడుక

Tue Jul 05 2022 19:00:02 GMT+0530 (IST)

Dhoni viral photo

ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్.. ఆ స్థాయిలో కాకున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా భారీ అభిమానగనం ను దక్కించుకున్నాడు.టీం ఇండియాకు అద్బుత విజయాలను అందించిన ఎంఎస్ ధోనీ ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు. అయినా కూడా క్రికెట్ గాడ్ ఫాదర్ గా ధోనీ మన్ననలు అందుకుంటూనే ఉన్నాడు.

ఈనెల 7వ తారీకున ధోనీ పుట్టిన రోజును భారీ ఎత్తున జరుపుకునేందుకు ఆయన అభిమానులు రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ మ్యాగజైన్స్ మరియు స్పోర్ట్స్ ఛానల్స్ ప్రస్తుతం ధోనీ బర్త్ డే కోసం భారీ ఎత్తున హంగామా చేసేందుకు సిద్దం అవుతున్నారు.

అందులో భాగంగానే స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఇలా చిరంజీవి గాడ్ ఫాదర్ పోస్టర్ ను మార్ఫింగ్ చేసి షేర్ చేసింది. నో క్లాస్ - నో మాస్ ఓన్లీ కూల్ వన్ అండ్ ఓన్లీ తలా అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ ఫస్ట్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను ఇలా మార్ఫింగ్ చేయడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ పోస్టర్ ను షేర్ చేసుకుంటూ ఉన్నారు. మిస్టర్ కూల్ అంటూ గాడ్ ఫాదర్ లుక్ లో ధోనీని చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

ధోనీ గాడ్ ఫాదర్ లుక్ పై సినీ మరియు క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అభిమానులు ప్రముఖంగా సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ ముందస్తుగా ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.