Begin typing your search above and press return to search.

ధోని నయా అవతార్.. ఈసారి పోలీస్ ఆఫీసర్ గా

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:30 PM GMT
ధోని నయా అవతార్.. ఈసారి పోలీస్ ఆఫీసర్ గా
X
భారత క్రికెట్‌‌ చరిత్రలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పినా.. ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తూ సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఇంకా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త దనాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.


రీసెంట్గా సినీ ఇండస్ట్రీలోకి నిర్మాణ సంస్థతో అడుగుపెట్టడు మహీ. ఇక ఎప్పటినుంచో యాడ్స్ లోను నటిస్తున్నాడు. ఆయా బ్రాండ్ల విలువ‌ను పెంచాడు. కోట్లాది రూపాయ‌లు ఆర్జించాడు.

తాజాగా, ధోని పోలీస్ అవతారం ఎత్తాడు. కొత్త యాడ్ కీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలో చుట్టూ కానిస్టేబుల్స్ ఉండగా మధ్యలో లాఠీ పట్టుకుని ధోని నిలబడి ఉన్నాడు.ఇవి చూసి అభిమానులు లుక్ అదిరింది, ధోని సూపర్ అని అంటున్నారు.

కాగా, 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే ధోని ప్రాక్టీస్ షురూ. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో సిక్సులు బాదుతూ మహి ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపాడు. ఇక ఇదే సమయంలో నిర్మాతగా కూడా తమిళంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య సాక్షితో కలిసి ధోని ఎంటర్టైన్​మెంట్​ బ్యానర్​పై దీన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి LGM అనే​క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. చెన్నైలో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. ధోని భార్య సాక్షి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.