పవర్ స్టార్ ఫ్యామిలీ నుంచి నటవారసురాలు

Tue Jul 27 2021 07:00:01 GMT+0530 (IST)

Getting ready for Entry from power star family

లెజెండరీ నటుడు రాజ్ కుమార్ ఫ్యామిలీ కన్నడ పరిశ్రమని ఏల్తోన్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ అనంతరం ఆయన కుమారులు వారసుడిగా  ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. శివరాజ్ కుమార్.. పునీత్ రాజ్ కుమార్ అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ గా పాపులరైన పునీత్ రాజ్ కుమార్ హవా అసాధారణం. ప్రస్తుతం అక్కడి పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ భారీగా పారితోషికం తీసుకుంటోన్న బడా హీరో. భారీ బడ్జెట్ చిత్రాలు చేసే ఏకైక హీరో. దక్షినాది పరిశ్రమ సహా బాలీవుడ్ లోనూ రాజ్ కుమార్ ఫ్యామిలీ నటులకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. సత్సంబంధాలు ఉన్నాయిఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి నటవారసురాలు సినీఎంట్రీకి రెడీ అవుతున్నారు. రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్ కన్నడ పరిశ్రమలో అదృష్ణాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమతున్నారు. మరికొన్ని రోజుల్లో ధన్య రామ్ కుమార్ సినిమా లాంచింగ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? కథ ఎలాంటింది?   హీరో- నిర్మాతలు ఎవరు? అన్న వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. ఇప్పటికే ధన్య రామ్ కుమార్ కన్నడ మీడియాలో బాగా ఫోకస్ అయ్యారు.

లోకల్ మీడియా ఆమెపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టి పనిచేస్తూనే ఉంది. దీంతో ఆమెకు ఎంట్రీకి ముందే చక్కని పాపులారాటీ దక్కుతోంది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ధన్య రామ్ కుమార్ కు  లాంచింగ్ సమస్య లేదు. అయితే  అటుపై ఆమె కేవలం  ట్యాలెంట్ తోనే  పైకి రావాల్సి ఉంటుంది. మరి ధన్య రామ్  ఎంతవరకూ  వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.