షాక్: జాతీయ అవార్డ్ స్టార్ ఓటీటీకి అంకితం

Sun Oct 24 2021 12:01:25 GMT+0530 (IST)

Dhanush Movies In Ott

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చిత్రాలు పూర్తిగా ఓటీటీకి అంకితం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా పీక్ స్టేజ్ లో ధనుష్ అండ్ టీమ్ ఓటీటీ రీలీజ్ లకే మొగ్గు చూపారు. థియేటర్ రిలీజ్ కోసం సమయం వృథా చేసుకోకుండా ఓటీటీకి వెళ్లి తెలివిగా సేప్ జోన్ లో కి వెళ్లారు. ఆరకంగా ధనుష్ ఓ టీటీ స్టార్ గా కోలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. ఇది ఓ రకంగా ధనుష్ ఎంపిక చేసుకున్న స్ట్రాటజీ అనే చెప్పాలి. భవిష్యత్  సినిమా అంతా ఓటీటీ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధునుష్ ఇలా ఓటీటీకి వెళ్లిపోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇప్పటికే ఆయన నటించిన  `జగమే తంధిరామ్` అనే సినిమా  ఓటీటీలో రిలీజ్ అయింది.ఇదే సినిమా థియేటర్లో రిలీజ్ అయితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని ట్రేడ్ వర్గాలు తేల్చేసాయి. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఇది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అక్కడ రిలీజ్ అయింది కాబట్టే నిర్మాతలు సేఫ్ అయ్యారు అన్న టాక్ బలంగా ఉంది.  ఆ తర్వాత `భూమి` ఈనే మరో చిత్రం కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో ధనుష్ కొత్త చిత్రం `మారన్` కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. డిస్నీ హాట్ స్టార్ ఈచిత్రం డిజిటల్ రిలీజ్ హక్కుల్ని భారీ ధరకు దక్కించుకుంది. త్వరలోనే రిలీజ్ తేదిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కథ థీమ్ విషయానికి వస్తే.. అహింసా మార్గంలో వెళ్లే వ్యక్తి న్యాయం కోసం పారాడే సమయంలో అతనికి అన్యాయం జరిగితే హింస వైపు ఎలా టర్న్ తీసుకున్నాడు? అన్న పాయింట్ తో `మారన్` కి ఏ.జవహార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమా హైప్ తీసుకొచ్చింది. మరి అంతిమంగా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం.

అయితే ఇలా వరుస పెట్టి ధనుష్  చిత్రాలు ఓటీటీ లో రిలీజ్ అవ్వడం పట్ల ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జగమే తంధిరమ్  రిలీజ్  సమయంలో ఎగ్జిబిటర్లు చాలా హడావుడి చేసారు. అగ్ర హీరో చిత్రం ఓటీటీ లో రిలీజ్ అవ్వడం కుదరదని తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసారు. థియేటర్లు మూసేస్తామని హెచ్చరించారు. అయితే ఓటీటీ రిలీజ్ తర్వాత ఫలితం దెబ్బకి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం కొత్త సినిమా రిలీజ్ నేపథ్యంలో హడావుడి నెలకొన్నా పాత అనుభవాల నేపథ్యంలో అంతగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లు కనిపించలేదు. సూర్య హీరోగా తెరకెక్కిన `జైభీమ్` కూడా ఓటీటీ లో వచ్చే నెలలో రిలీజ్ అవుతన్న సంగతి తెలిసిందే.