డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు స్టార్ హీరో మరో సినిమా..?

Sat Jan 15 2022 08:00:01 GMT+0530 (IST)

Dhanush Maaran to release on OTT platform

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. వాటిల్లో ''మారన్'' సినిమా ఒకటి. యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన 'మాస్టర్' బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది.ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'మారన్' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని భావిస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

''మారన్'' చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే ధనుష్ హీరోగా నటించిన 'జగమే తంత్రం' 'అట్రాంగిరే' వంటి సినిమాకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'మారన్' మూవీ కూడా డిజిటల్ వేదిక మీదకు వస్తుందేమో చూడాలి.

కాగా 'మారన్' చిత్రాన్ని ఎమోషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్ - మాళవిక ఇద్దరూ జర్నలిస్టులుగా కనిపించనున్నారు. విలక్షణ నటుడు సముద్రఖని - మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై సెంధిల్ త్యాగరాజన్ - అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.