Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ టాక్: ధ‌నుష్ తంత్రం ఫ‌లిస్తుందా?

By:  Tupaki Desk   |   19 Feb 2020 1:30 PM GMT
పోస్ట‌ర్ టాక్: ధ‌నుష్ తంత్రం ఫ‌లిస్తుందా?
X
తమిళ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ లో పాగా వేసేందుకు అనుస‌రిస్తున్న‌ తంత్రం గురించి తెలిసిందే. వైవిధ్యం ఉన్న సినిమాల్లో న‌టిస్తూ ఎంత ట్రై చేస్తున్నా ఇన్నాళ్లు ఆశించినంత పెద్ద హిట్టు త‌గ‌ల్లేదు. ర‌ఘువ‌ర‌న్ బీటెక్ మిన‌హా వేరే సినిమాలేవీ పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో అత‌డి తంత్రం ఫ‌లించ‌లేద‌న్న టాక్ వినిపించింది. అయినా ఏమాత్రం నిరాశ చెంద‌క ప‌దే ప‌దే ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. ఇటీవ‌ల తమిళంలో వడా చెన్నై-మారి 2-అసురన్- ప‌ట్టాస్ లాంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం పిజ్జా -పేటా చిత్రాల్ని తెర‌కెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి పనిచేస్తున్నాడు.

ధనుష్ 40వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా క‌థాంశం గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ కావ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా చిత్ర‌బృందం అధికారిక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్ ఆద్యంతం ఎంతో స్టైలిష్ లుక్ తో ఆక‌ట్టుకుంది. ధనుష్ లుంగీ క‌ట్టి రెండు చేతుల‌తో గ‌న్స్ చేత‌ప‌ట్టి ఝ‌డిపించేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాను కార్తీక్ సుబ్బ‌రాజు రొటీన్ కి భిన్నంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఈ మోష‌న్ పోస్ట‌ర్ చెబుతోంది.

ఈ చిత్రానికి తెలుగులో `జగ‌మే తంత్రం` అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. కబాలి ఫేమ్ సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ర‌క్తి క‌ట్టించింది. ఇందులో జేమ్స్ కాస్మో- ఐశ్వర్య ల‌క్ష్మి - కలైరసన్- జోజు జార్జ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్ర‌హ‌ణం.. వివేక్ హర్షన్ ఎడిటింగ్ అస్సెట్ కానున్నాయి. యువి క్రియేషన్స్ - జిఎ 2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. వైనాట్ స్టూడియోస్ -రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.