తిట్లు లంకించుకున్న డార్లింగ్ ఫ్యాన్స్!

Fri Feb 21 2020 14:45:06 GMT+0530 (IST)

Dhanush First Look Irks Prabhas Fans

ఓర్పు గురించి సహనం గురించి ఎన్నో చెప్తుంటారు కానీ అదంతా కోపం రానంతవరకే. ఒక్కసారి కోపం వస్తే ఆర్ణబ్ గోస్వామి లాగా అరవడమే పని. ఆయన ఎవరో తెలియదు అంటారా? అలా అయితే ఆయనకు జెరాక్సులు మన టీవీలలో కూడా తగలడ్డాయి లెండి. సరే.. ఈ కోపం టీఆర్పీల కోసం తెచ్చుకున్న కోపం. కోపం చాలా రకాలుగా ఉంటుంది కదా. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈమధ్య ఒక విషయంలో కోపం కట్టలు తెంచుకుంది. బూతులు లంకించుకున్నారు.ఎందుకు అంటే.. యూవీ క్రియేషన్స్ వారు మొదటి నుంచి ప్రభాస్ సినిమాలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడంలో విఫలమవుతున్నారు. అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. దీంతో వారికి కోపం కట్టలు తెంచుకుంటోంది. ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమా అప్డేట్లు ఏవీ పెద్దగా రావడం లేదు. ఇదిలా ఉంటే నిన్న తమిళ హీరో ధనుష్ కొత్త సినిమా 'జగమే తంత్రం' పోస్టర్ ను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీంతో చాలామంది అభిమానులు యూవీ వారి పై బూతుల వర్షం కురిపించారు.

- టాలీవుడ్ లో ** ప్రొడక్షన్ హౌస్. మాకు ప్రభాస్20 టైటిల్ కావాలి.

- పక్కనోడి సినిమాపై ఉండే ఇంట్రెస్ట్ ప్రబాస్ అన్న మూవీపై ఉండదు కదరా నీకు **.

- ఎందుకురా ఇట్టా ఆడుకుంటావ్ మాతో. ఇదో **** ప్రొడక్షన్ హౌస్. టైటిల్ రిలీజ్ చెయ్ లేకపోతే ప్రభాస్ అన్నను వదిలెయ్.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... పదుల సంఖ్యలో ఫ్యాన్స్ యూవీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇది ధనుష్ సినిమా పోస్టర్ షేర్ చేసినందుకు కోపం కాదు. ప్రభాస్ సినిమా అప్డేట్స్ రావడం లేదనే అసహనం. డార్లింగ్ ఫ్యాన్స్ మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అర్థం అవుతోంది కదా.