సౌత్ స్టార్ హీరో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటుతాడా..?

Thu Nov 25 2021 11:06:26 GMT+0530 (IST)

Dhanush Atrangi Re Official Trailer

సౌత్ నుంచి హీరోలు నార్త్ కి వెళ్లినా సక్సెస్ కొట్టడం అంత వీజీ కాదు. బాహుబలితో ప్రభాస్ కి సాధ్యమైనది అందరికీ సాధ్యం కాదు. అలాగే రాంజానాతో ధనుష్ కి సాధ్యమైనది ఇతరులకు కుదరదు. ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్ తో ఈ ఫీట్ రిపీట్ చేయాలని చూస్తుంటే ధనుష్ అట్రాంగిరేతో సత్తా చాటాలనుకుంటున్నాడు.కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ `రాంజానా` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయి ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. తొలి చిత్రమే ధనుష్ కి మంచి పేరు తీసుకొచ్చింది. నటుడిగా బాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే ప్రూవ్ చేసాడు. ఆనంద్ ఎల్ . రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్శియల్ గా పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత ధనుష్ `షమితాబ్` లో అమితాబచ్చన్ తో కలిసి నటించాడు.

కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత ధనుష్ ని లాంచ్ చేసిన ఆనంద్ ఎలా. రాయ్ `అట్రాంగి రే` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్- ధనుష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అట్రాంగిరే ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. ట్రైలర్ ఆనంద్ ఎల్ రాయ్ గత సినిమాల్ని మరపిస్తోంది. `తను వెడ్స్ మను`..`రాంజానా` సినిమాల్లా ఎమోషనల్ ఎంటర్ టైనర్ లా కనిపిస్తుంది. తమిళ అబ్బాయి..హిందీ అమ్మాయికి పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేస్తాను.

ఆ కారణంగా విడిపోవాలని ఆ జంట భావిస్తుంది. కొంత గ్యాప్ కారణంగా అబ్బాయికి అమ్మాయి మీద ప్రేమ పుట్టడం..అమ్మాయి కూడా పాజిటివ్ గా మారడం ట్విస్టు. ఈ లోపు అమ్మాయిని మరో అబ్బాయి ఇంప్రెస్ చేయడం.. అతని తో వెళ్లిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నవాడు? ఎలాంటి ఎమోషన్ కి గురయ్యాడు? అన్నదే కథ.

`తను వెడ్స్ మను`కి సీక్వెల్ లా కనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సారా ఆ పాత్రలో ఒదిగిపోయినట్లే కనిపిస్తోంది. ఇక ధనుష్ నటనలో తనదైన మార్క్ కనిపిస్తుంది. అక్షయ్ కుమార్ పాత్ర కూడా చాలా కీలకంగానే హైలైట్ అవుతుంది. ట్రైలర్ పరంగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫలితాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార పనుల్లో నిమగ్నమైంది. ధనుష్ బాలీవుడ్ మార్కెట్ కోసం సీరియస్ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. కోలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా లో ఫేమస్ అవ్వాలని ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.