జంటను కలపడంలో రజనీ సఫలమవుతారా?

Thu Jan 27 2022 06:00:02 GMT+0530 (IST)

Dhanush Aishwaryaa split Very badly affected Rajinikanth

ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ నుండి విడిపోవడం వారి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. ఈ జంట తమ 18 ఏళ్ల వివాహానికి తెరపడిందని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. వీరికి యాత్ర -లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  రజనీకాంత్ తన కుమార్తె విడాకుల ప్రకటనతో చాలా తీవ్రంగా ప్రభావితమయ్యారని అర్థమవుతోంది. వాస్తవికతతో ఒప్పుకోనట్లు కనిపిస్తోంది.``రజినీ సర్ తన కూతురు విడిపోవాలనే నిర్ణయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. విడిపోవడం తాత్కాలికమేనని అతను పట్టుబట్టి ఉంటాడు. తన కూతురి నుంచి విడిపోవద్దని ఒత్తిడి చేస్తున్నాడు`` అని చెన్నైకి చెందిన ఒక మూలం నుంచి జర్నలిస్టు సుభాష్ కె ఝా ద్వారా ప్రకటితమైంది. రెండు కుటుంబాలు జంటను సయోధ్య కోసం ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది. భార్యాభర్తల మధ్య తగాదాలు సాధారణమైనవేవీ కాదు. ధనుష్- ఐశ్వర్య మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. కానీ ఏదోవిధంగా రజనీకాంత్ ఎప్పుడూ కలిసి ఉండేలా వారిని ఒప్పించగలిగాడు. విడిపోవడంపై రజనీకాంత్ ఇంకా బహిరంగ ప్రకటన చేయలేదు.

కిద్ది రోజుల క్రితం.. ధనుష్ తండ్రి కస్తూరి రాజా ప్రముఖ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ఈ జంట విడాకుల కోసం వెళ్లడం లేదని ఇది సాధారణ కుటుంబ తగాదా అని చెప్పారు. ``ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకోలేదు. ఇది వారి మధ్య అభిప్రాయ భేదాల వల్ల గొడవ. కాబట్టి ఇది రొటీన్ ఫ్యామిలీ గొడవ. ప్రస్తుతం ఇద్దరూ ఊరు బయట ఉండి హైదరాబాద్ లో ఉంటున్నారు. నేను వారితో ఫోన్ లో మాట్లాడాను. వారికి కూడా సలహా ఇచ్చాను`` అని తెలిపారు.

జనవరి 17న సోమవారం అర్థరాత్రి ధనుష్ - ఐశ్వర్య ఒక లేఖను విడుదల చేశారు. ``18 సంవత్సరాల పాటు స్నేహితులుగా జంటగా తల్లిదండ్రులుగా శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు కలిసి ఉన్నాం. ప్రయాణం ఎదుగుదల అవగాహన సర్దుబాటు అనుకూలతతో కాపురం సాగింది. . ఈ రోజు మేము మా మార్గాలు విడిపోయే ప్రదేశంలో ఉన్నాము. ఐశ్వర్య - నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మంచి వ్యక్తులుగా మమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. మాకు వ్యవహరించడానికి అవసరమైన గోప్యతను ఇవ్వండి`` అని లేఖలో రాసారు. విడిపోయిన జంటను మళ్లీ ఒక చోట చేర్చడంలో ఇరు కుటుంబాలు విజయం సాధిస్తాయో లేదో చూడాలి.