పవన్ ఫ్యాన్స్ కులం కార్డు వాడుతున్నారు ..దేవి ఫైర్

Wed Sep 30 2020 21:00:44 GMT+0530 (IST)

Pawan fans are using caste card..devi fire

బిగ్‌బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చిన టీవి9 న్యూస్ రీడర్ దేవి నాగవల్లి బలమైన కంటెస్టెంట్ గా కనిపించింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేసేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. దేవి నాగవల్లికి కావాల్సిన స్థాయిలో ఓట్లు వచ్చినా కావాలనే ఆమెని ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.దేవి టీవి9 ఎంప్లాయ్ కావడం వల్లే ఆమెని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారని ఆ కారణంగానే దేవి ఎలిమినేట్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. కావాలనే పవన్ ఫ్యాన్స్ దేవి నాగవల్లిని ఎలిమినేట్ అయ్యేలా చేశారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవి నాగవల్లి పవన్ ఫ్యాన్స్ పై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నేను బిగ్‌బాస్ టీమ్ ని నమ్మాను. కానీ బయటికి వచ్చాక అసలు విషయం తెలిసింది.

నేను బలైపోయానని బాధపడ్డా. నా ఎలిమినేషన్ కు జన్యూన్ ఓటీంగ్ రాలేదని.. నేను జన్యూన్ గా ఆడానని ... ఎక్కడా డ్రామాలు చేయలేదని చెప్పింది. దేవి. బిగ్ బాస్ వాళ్లు షోలోకి ఎంటరయ్యే ముందు ఎవరికీ తెలియని విషయం చెప్పమంటే తనకు దాసరి తాతయ్య అవుతారని చెప్పానని అది కూడా తన అమ్మ ఓ ఇంటర్త్యూలో చెప్పిందని కానీ పవన్ ఫ్యాన్స్ ఎప్పుడూ కుల ప్రస్థావన తీసుకొస్తున్నారు. కానీ తాను మాత్రం కమ్యూనిటీ గురించి చెప్పలేదని సెటైర్లు వేస్తోంది.