ఓట్ల ప్రకారం నన్ను ఎలిమినేట్ చేయలేదు : దేవి

Tue Sep 29 2020 21:06:42 GMT+0530 (IST)

Did not eliminate me according to votes: Devi

బిగ్ బాస్ సీజన్ 4 నుండి మూడవ వారం తర్వాత దేవి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉన్నారు. అయినా కూడా దేవి ఎలిమినేట్ అవ్వడం అందరికి షాకింగ్ గా ఉంది. ఆమె ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా ప్లాన్ చేశారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆమె వెళ్లే అవకాశం ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. కాని ఆమె మాత్రం మళ్లీ వెళ్లే అవకాశం ఉండక పోవచ్చు అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఎలిమినేషన్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ చేయమన్నవి అన్ని కూడా నేను చేశాను. ఎప్పుడు కూడా రూల్స్ కు వ్యతిరేకంగా నేను వెళ్లలేదు. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను. నా వల్ల గేమ్ ప్లాన్ మారిపోతుందని తన వల్ల స్క్రిప్ట్ ప్లాన్ మార్చాల్సి వస్తుంది అనే కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు తనను ఎలిమినేట్ చేశారేమో అనిపిస్తుందని దేవి పేర్కొంది. తనతో ఎలిమినేషన్ లో ఉన్న వారిలో కొందరికి నా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా కూడా నన్ను ఎలిమినేషన్ చేశారంటూ ఆమె ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ వెళ్లే అవకాశం వస్తే వెళ్తారా అంటూ ప్రశ్నించగా తప్పకుండా వెళ్తాను. కాని ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ పంపించే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. మళ్లీ 14 రోజులు క్వారెంటైన్ కు తీసుకు వెళ్లి పంపించడం టెక్నికల్ గా సాధ్యం కాదు. అందుకే నేను మళ్లీ వెళ్లే అవకాశం లేదని ఆమె పేర్కొంది.