Begin typing your search above and press return to search.

ఒకేసారి మాల్దీవ్స్ లో విజయ్, రష్మిక!

By:  Tupaki Desk   |   7 Oct 2022 8:30 AM GMT
ఒకేసారి మాల్దీవ్స్ లో విజయ్, రష్మిక!
X
సినీ తారలకు ఏమాత్రం గ్యాప్ వచ్చినా కూడా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగా ఇష్టపడుతుంటారు. రోజు గంటల తరబడి షూటింగ్స్ లో అలసిపోతూ.. చేసిన సన్నివేశాలు మళ్లీమళ్లీ చేసి కొన్నిసార్లు తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉంటారు. ఒక విధంగా యాక్టింగ్ చేయడం అనేది చాలామందికి కష్టంగానే ఉంటుంది.

ముఖ్యంగా హీరో హీరోయిన్స్ అయితే పలుమార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఆ ప్రెజర్ అంతా తీర్చుకోవడానికి వారు కొంతకాలం గ్యాప్ కూడా తీసుకుంటూ ఉంటారు.

ఇక ముఖ్యంగా చాలామంది ఇటీవల కాలంలో మాల్దీవ్స్ వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు కూడా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఎవరు వెళ్లారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలకు సంబంధించిన ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో ఒకే రోజు కనిపించడం వైరల్ గా మారింది.

వీరిద్దరూ ఇదివరకే గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలతోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈ జోడి పై మధ్యలో చాలా రకాల రూమర్లు అయితే వచ్చాయి.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత వీళ్ళు వార్తలను కొట్టి పారేశారు. ఇక రీసెంట్ గా రష్మిక మందన గుడ్ బై సినిమా ప్రమోషన్లు పాల్గొన్న తర్వాత మళ్లీ వెంటనే మాల్దీవ్స్ కు వెళ్ళాలి అని డిసైడ్ అయింది. ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మొన్నటి వరకు విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో చాలా బిజీగా కనిపించాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అతను చాలా వరకు ఫ్యామిలీతోనే ఇంట్లోనే ఉన్నాడు. అలాగే ఖుషి సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక మరొక షెడ్యూల్ మొదలవడానికి కొంత సమయం ఉంది కాబట్టే విజయ్ దేవరకొండ ఈ గ్యాప్ లో గ్యాప్ తీసుకొని మాల్దీవ్స్ కు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.