Begin typing your search above and press return to search.

జర్నలిస్ట్ పై దర్శకుడు దేవా కట్టా సెటైర్

By:  Tupaki Desk   |   12 Sep 2021 10:32 AM GMT
జర్నలిస్ట్ పై దర్శకుడు దేవా కట్టా సెటైర్
X
సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వార్తలపై టాలీవుడ్ సెలబ్రెటీలు మండిపడుతున్నారు. మీడియాపై, ఓ జర్నలిస్టులపై కామెంట్లు చేస్తున్నారు. సినీ ప్రముఖులపై కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై డైరెక్టర్ దేవా కట్టా సెటైర్ వేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక వీడియోను పంచుకున్నారు.

‘ఈ జర్నలిస్టు ఎవరో తెలియదు. కానీ పులిట్జర్ అవార్డుకు అర్హుడు’ అని రాసుకొచ్చాడు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే.. ‘సాయిధరమ్ తేజ్ వాడిన బైక్ ధర, కెపాసిటీ తదితర విషయాలను వివరించాడు. ’ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ వివాదంలో కూడా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సాయిధరమ్ తేజ్, స్కిడ్ కావడంతో అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ యాక్సిడెంట్ కు మసాలా దట్టించి.. ఉన్నది లేదని కల్పించి కొన్ని మీడియా సంస్థలు కాస్త అతి చేస్తూ వార్తలు రాశాయన్న విమర్శలు సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తున్నాయి. అతి వేగం అని కొందరు, ఇద్దరి మధ్య రేసింగ్ అని ఇంకొందరు రాసేశారు. దీంతో ఈ వార్తలపై స్పందించిన హరీష్ ఓ సెటైరికల్ మెసేజ్ పెట్టారు.

‘హ్యాట్సాఫ్ తమ్ముడు సాయిధరమ్ తేజ్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరూ బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను’ అని పేర్కొంటూ హరీష్ శంకర్ ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ కౌంటరిస్తున్నారు. హరీష్ కు మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.