Begin typing your search above and press return to search.

హీరోలుగా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్న వారసులు...!

By:  Tupaki Desk   |   31 July 2020 2:30 AM GMT
హీరోలుగా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్న వారసులు...!
X
సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతిపై ఎన్ని చర్చలు జరిగినా విమర్శలు వచ్చినా నటవారసులను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా తమ పిల్లల్ని కాకుండా పక్కింటి పిల్లల్ని హీరోలుగా ఎందుకు పరిచయం చేస్తారులేండి. కాకపోతే టాలెంట్ తో పని లేకుండా.. యాక్టింగ్ వచ్చినా రాకున్నా.. బ్యాగ్రౌండ్ ఉంటే చాలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేయవచ్చు అనే మోటివ్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇది మన టాలీవుడ్ కే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలలో సినీ ప్రముఖులు తమ వారసులను పరిచయం చేసారు. వారిలో చాలామంది తమ ప్రతిభని నిరూపించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యారు. నిజానికి సినీ బ్యాగ్రౌండ్ అనేది ఫస్ట్ సినిమాకి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరి టాలెంట్ మీద వారు నిలదొక్కుకోవాల్సిందే. ఈ విషయం టాలీవుడ్ లో ఎన్నో సార్లు నిజమైంది.

కాగా దర్శకరత్న దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ కుమార్.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ లు హీరోలుగా సక్సెస్ కాలేకపోయారు. బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక అల్లు అరవింద్ కుమారుల్లో బన్నీ హీరోగా సక్సెస్ అవ్వగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ తెలుగులో ప్రభావం చూపలేకపోయాడు. ఎమ్.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ లు హీరోలుగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా కూడా ఇండస్ట్రీలో హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కూడా తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దర్శకుడు సతీష్ వేగేశ్న తనయుడు కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే వీళ్ళందరిని నెపోటిజం హీరోలని కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఫైనల్ గా ప్రేక్షకులు అంగీకరించిన వారు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారని చెప్పవచ్చు.