ఒక్క హిట్ తో భారీగా డిమాండ్ చేస్తోంది

Wed Jun 29 2022 05:00:01 GMT+0530 (IST)

Demanding More with a single hit

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ లుగా పేరు తెచ్చుకున్న వాళ్లంతా ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లోని కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. నదియా ఖుష్బూ టబు వంటి సీనియర్ హీరోయిన్ లు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్ లు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టబు ప్రస్తుతం భారీగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో నటిస్తూ వస్తోంది.రీసెంట్ 51 లోకి అడుగుపెట్టిన టబు ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ నటిగా పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. బాలీవుడ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ టబుతో సినిమాలు చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారట.

రీసెంట్ గా ఆమె నటించిన థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'భూల్ బులయ్యా -2'. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీని అనీస్ బజ్మీ రూపొందించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ హారర్ కామెడీలో సీనియర్ హీరోయిన్ టబు కీ రోల్ పోషించింది.

బాలీవుడ్ పాండమిక్ నుంచి సరైన హిట్ లేక బిక్కు బిక్కుమంటున్న వేళ 'భూల్ బులయ్యా 2' రూపంలో భారీ ఊరట లభించింది. ఒక్క రోజే ఈ మూవీ వంద కోట్ల మార్కుని దాటడంతో బాలీవుడ్ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేయడమే కాకుండా నిర్మాత హీరో కార్తిక్ ఆర్యన్ కు కాస్ట్ లీ స్పోర్ట్స్ కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ విజయంలో హీరో కార్తిక్ ఆర్యన్ తో పాటు టబు కూడా కీలక పాత్ర పోషించడంతో బాలీవుడ్ లో ప్రస్తుతం టబుకు భారీ డిమాండ్ ఏర్పడింది.

అంతే కాకుండా ఇందులో టబు డ్యుయెల్ రోల్ లో కనిపించి మరింతగా సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో ఆమె కోసం ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పోటీపడుతున్నారట. ఇప్పటికే టబు మూడు భారీ క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మూడు ప్రాజెక్ట్ లకు టబు భారీగానే పారితోషికం డిమాండ్ చేసినట్టుగా ముంబై వర్గాలు అంటున్నాయి.  

ఇదిలా వుంటే రెండేళ్ల క్రితం టబు తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' మూవీలో హీరోకు తల్లిగా కీలక పాత్రలో నటించడం.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు తిరగరాసింది. అయితే ఈ మూవీ తరువాత తెలుగులో మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయని టబు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా మారిపోవడం విశేషం.