డీజే టిల్లు 2: అక్కడ ఫుల్ డిమాండ్

Tue Jan 24 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Demand For DJ Tillu 2 Movie

సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. లోబడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 25 కోట్ల వరకు లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. 5 కోట్ల తో తీసిన సినిమాకి నాలుగు రెట్లు లాభాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ని సిద్దు సిద్ధం చేశాడు. డీజే టిల్లు స్క్వేర్ టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. మొదటి సినిమా కంటే కాస్తా ఎక్కువ బడ్జెట్ తోనే ఈ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీకి కూడా కథ సిద్ధం చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ నిజాం ఏరియాలో ఏకంగా 7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఓ విధంగా చెప్పాలంటే నిజాం ఏరియాలో డీజే టిల్లుకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపధ్యంలో ఈ సీక్వెల్ కోసం నిర్మాత నాగ వంశీ ఏకంగా 9 కోట్ల వరకు థీయాట్రికల్ రైట్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిజాంలో వచ్చే రెస్పాన్స్ దృష్ట్యా ఆ స్థాయిలో ఇవ్వడానికి బయ్యర్లు కూడా సిద్ధంగా ఉన్నారనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో నడుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే కేవలం నిజాంకి మాత్రమే పరిమితం కాకుండా ఒటీటీ శాటిలైట్ రైట్స్ కోసం గట్టిగానే పోటీ ఉన్నట్లు తెలుస్తుంది.

సిద్దు కామెడీ టైమింగ్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తాయని భావిస్తున్నారు. సిటీలో ఉండే మాస్ పీపుల్ అందరూ కూడా టిల్లు క్యారెక్టర్ ని రిలేట్ చేసుకోవడంతో అందరికి ఈ సినిమా భాగా కనెక్ట్ అయ్యింది. ఇక స్క్వేర్ విషయంలో కూడా అదే ఫీట్ రిపీట్ అవుతుందనే హీరో సిద్దు గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే మరింత పెర్ఫెక్ట్ గా ఈ మూవీని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.