Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. పెళ్లి సందDలో దీప్తి భ‌ట్నాగ‌ర్..?

By:  Tupaki Desk   |   23 Jun 2021 10:30 AM GMT
#గుస‌గుస‌.. పెళ్లి సందDలో దీప్తి భ‌ట్నాగ‌ర్..?
X
శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన పెళ్లి సంద‌డి సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. 90ల‌లో మ్యూజిక‌ల్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీలో క‌థానాయిక‌లుగా న‌టించిన ర‌వళి- దీప్తి భ‌ట్నాగ‌ర్ ల‌ను తెలుగు ఆడియెన్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. అందునా ధీప్తి భ‌ట్నాగ‌ర్ నాటి యూత్ కి వెరీ స్పెష‌ల్. దీప్తి నాభి సొగ‌సును ఆ దిగువ మ‌చ్చ‌ను కూడా అంత తేలిగ్గా మ‌రువ‌డం క‌ష్టం. ఉత్త‌రాది బ్యూటీ ధీప్తి భ‌ట్నాగ‌ర్ ని అంత అందంగా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కేంద్రుడు. దీప్తి న‌వ్వు ఇస్ట‌యిల్ ప్ర‌తిదీ మ‌ర్చిపోలేరు. ఇక ఈ మూవీకి కీర‌వాణి అందించిన సంగీతం అంతే పెద్ద అస్సెట్ అయ్యింది.

అయితే పెళ్లి సంద‌డి బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కానీ దీప్తి భ‌ట్నాగ‌ర్ ఎందుక‌నో ఆ త‌ర్వాత తెలుగులో న‌టించ‌లేదు. 1996లో పెళ్లి సంద‌డి రిలీజైతే ఇప్ప‌టికి శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్ హీరోగా అదే టైటిల్ తో రాఘవేంద్ర‌రావు సార‌థ్యంలో పెళ్లి సంద‌-డి తెర‌కెక్కుతోంది. ఇక ఈ మూవీకి ఎంపిక చేసుకున్న బ్యూటీ కూడా దీప్తి భ‌ట్నాగ‌ర్ కి చెల్లెలినే త‌ల‌పిస్తోంది అంటూ కాంప్లిమెంట్లు అందుకుంటోంది. అన్న‌ట్టు పెళ్లి సంద‌డి లో న‌టించిన దీప్తి భ‌ట్నాగ‌ర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్న‌ది ఆరా తీస్తే.. దీప్తి ఇటీవ‌ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 53 ఏజ్ .. త‌న‌కు హీరో అయ్యేంత కొడుకు ఉన్నా.. ఇప్ప‌టికీ వేడి త‌గ్గ‌నే లేద‌ని త‌న ఇన్ స్టా పోస్టులు చూస్తే తెలుస్తోంది.

దీప్తీ భట్నాగర్ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా అవ‌న్నీ ఇన్ స్టాలో వేడెక్కిస్తున్నాయి. తాజాగా బ్లాక్ బికినీలో పూల్ సైడ్ రిలాక్స‌వుతున్న వేరొక ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. నో నెగెటివ్ థాట్స్ అలోవ్డ్ అన్న ట్యాగ్ ని ఇచ్చారు. అన్న‌ట్టు రాఘవేంద్ర‌రావు నేటి జ‌న‌రేష‌న్ తో పెళ్లి సంద‌-డి తీస్తున్నారు కాబ‌ట్టి మ‌రోసారి దీప్తి భ‌ట్నాగ‌ర్ ని పిలిచి ఏదైనా స్పెష‌ల్ సాంగ్ ని కానీ స్పెష‌ల్ క్యారెక్టర్ కానీ ఇస్తారేమో చూడాలి. నాటి పెళ్లి సంద‌డి లో దీప్తి భ‌ట్నాగ‌ర్ తో క‌లిసి న‌టించిన ర‌వ‌ళి ఏమ‌య్యారు? అంటే.. బిజినెస్ మేన్ నీలి కృష్ణను పెళ్లాడారు. ఈ జంట‌కు ఇద్ద‌రు వార‌సులు ఉన్నారు.