రెడ్ కార్పెట్ పై బ్రాండ్ కే వన్నె తెచ్చిన బ్యూటీ దీపిక!

Tue May 24 2022 12:00:01 GMT+0530 (IST)

Deepika on Cannes Red Carpet

75వ కేన్స్ ఉత్సవాల్లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే  మెరుపులు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై  డిజైనర్ దుస్తుల్లో వెలుగుజిలుగులు సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతున్నాయి. జ్యూరీ సభ్యురాలి హోదాతో పాటు..కంటెస్టెంట్ గానూ  దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇండియా నుంచి ఎంత మంది భామలు పోటీలో ఉన్నా దీపికపైనే అటెన్షన్ హైలైట్ అవుతుంది.తాజాగా మరోసారి రెడ్ కార్పెట్ వాక్ పై లూయిస్ విట్టన్ బ్రాండ్ ని మెరిపించింది. బ్లాక్ కలర్ లూయిస్ విట్టన్ బ్రాండెడ్ దుస్తుల్లో అమ్మడు హోయలు పొయింది. డిసిషన్ టూ లీవ్( హియోజిల్ క్యోల్షిమ్) ప్రదర్శనలో దీపిక ఇలా మెరిసింది. దీపిక ధరించిన డిజైనర్ ఓ ఎత్తైతే...అమ్మడు వాక్ లో ప్రేక్షకుల్ని తనదైన అందమైన  స్మైల్ తో లాక్ చేసింది.

రొటీన్ కి భిన్నమైన మ్యాకప్ ..హెయిర్ స్టైల్...యాక్సరసీస్ ఇలా ప్రతీది చూపరుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటో దీపిక అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. ఇక పెస్టివల్ లో భాగంగా జ్యూరీ సభ్యులతో మాట మంతి కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందిస్తున్నట్లు తెలిపింది.

అక్కడున్న జ్యూరీ సభ్యులెవరు తనకు తెలియదని..అంతా కొత్తవారైనా ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో పరిచయ కార్యక్రమం..లంచ్..డిన్నర్ వంటి ఎంతో  చక్కగా సాగుతున్నాయని తెలిపింది.

దీపిక కొన్నేళ్లగా గ్లోబల్ బ్రాండ్ లను ఎండార్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేన్స్ ఉత్సవాలకు వెళ్లే ముందు లూయిస్ విట్టన్ తమ ప్రచార కర్తగా దీపికని ఎంపిక చేస్తుంది. దీంతో దీపిక చేతిలో మరోకొత్త బ్రాండ్ చేరింది. కేన్స్ ఉత్సవాల్లో లూయిస్ విట్టన్ బ్రాండ్ నే ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది.

దీపికా పదుకొణే కెరీర్ విషయానికి టాలీవుడ్ లో 'ప్రాజెక్ట్ -కె' తో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన జంటగా నటిస్తోంది. దీపిక ప్రవేశంతో ప్రాజెక్ట్ -కె కి శోభ సంతరించుకుంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గ అసలైన హీరోయిన్ అంటూ కితాబు అందుకుంటుంది. బాలీవుడ్ లో యదావిధిగా సినిమాలు చేస్తూ బీజీగానే ఉంది. ముగ్గురు సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తుంది. షారుక్ సరసన 'పఠాన్' లో... హృతిక్ రోషన్ తో 'ఫైటర్' లో నటిస్తుంది.  ఇటీవలే 'గెహ్రైయాన్' సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.