దీపిక హద్దులు దాటేసింది..విరుచుకుపడ్డ ట్రోలర్స్!

Tue Jan 25 2022 10:39:49 GMT+0530 (IST)

Deepika crosses boundaries trolls increases

ఇటీవలి కాలంలో ట్రోలింగ్ బారిన పడుతోన్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. మీడియం రేంజ్ హీరోయిన్ లు ఒకప్పుడు ట్రోలర్లకి దొరికిపోయేవారు. అయితే ఇప్పుడా సీన్ మారింది. ఎంతటి వారికైనా  ట్రోలింగ్ తప్పలేదు. అమితాబచ్చన్ దగ్గర నుంచి ఐశ్వర్యా రాయ్ వరకూ చాలా మంది ట్రోలింగ్ ని ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ప్రియాంక చోప్రా..మలైకా ఆరోరా.. కాజోల్ అగర్వాల్.. స్వరా భాస్కర్ సహా పలువురు హీరోయిన్లు ట్రోలింగ్ గురయ్యారు. తాజాగా దీపికా పదుకొణే కూడా ట్రోలర్లకు చిక్కింది. అయితే హీరోయిన్లు అంతా ప్రయివేటు ఈవెంట్లలో పాల్గొని ట్రోలింగ్ కి గురి కాగా దీపిక మాత్రం తన సినిమా ప్రమోషన్ లో దొరికిపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ `గెహ్రైయాన్` అనే సినిమాలో నటిస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమా వచ్చే నెల 1న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. దానిలో భాగంగా యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టింది. సినిమాలో మొదటి పాటని విడుదల చేసారు. ఇందులో దీపికా పదుకొణే హద్దులు చెరిపేసింది. హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగింది. దీంతో ట్రోలర్స్ ఎటాక్ షురూ చేసారు. సోషల్ మీడియా వేదికగా దీపికపై నెగిటిటీ పెరిగిపోయింది. పెళ్లైన హీరోయిన్  ఇంత బోల్డ్ గా నటిండచం ఏంటో? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. పెళ్లైన తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో  గతంలోనూ నటించింది.

మరి కొత్తగా ట్రోలింగ్ కి  కారణం ఏంటి? అంటే.. ఊహించనంతగా హద్దులు దాటి రొమాన్స్ ని పీక్స్ కి చేర్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ  ట్రోలింగ్ ని మాత్రం దీపిక అస్సలు పట్టించుకోలేదు. తన సినిమా ప్రమోషన్ లో బిజీ అయింది. ట్రోలింగ్ గురించి ప్రశ్నించగా..వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు అన్న తీరుగా వ్యవహరిస్తోంది. `గెహ్రైయాన్ చిత్రానికి శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్నారు. మరో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది.