మాజీ లవర్ టాట్టూని ఎలా చెరిపేసిందంటే?

Fri May 29 2020 11:00:46 GMT+0530 (IST)

Deepika Padukone talks about Ranbir Kapoor tattoo

పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకొనే ప్రేమాయణాల గురించి తెలిసిందే. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా మొదలై అటుపై అందాల పోటీల టైటిల్ విజేతగా ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ లో అడుగు పెట్టిన దీపిక దాదాపు అరడజను మంది బోయ్ ఫ్రెండ్స్ తో షికార్లు చేసింది. దీపిక ఎఫైర్లపై ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో బోలెడన్ని కథనాలొచ్చాయి. రణబీర్ కపూర్- రణవీర్ సింగ్- యువరాజ్ సింగ్- సిద్ధార్థ్ మాల్యా .. ఇంకా పలువురి పేర్లు ఈ ప్రేమకథల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్ని ఎఫైర్లు ఉన్నా.. వీటిలో చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ తో ప్రేమాయం మాత్రం నిరంతరం హాట్ టాపిక్.రణబీర్ నుంచి విడిపోయి ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ని దీపిక పెళ్లాడినా కానీ ఇంకా తన మనసులో రణబీరే ఉన్నాడని అభిమానులు నమ్ముతారంటే ఆ జంట లవ్ స్టోరీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక రణబీర్ కపూర్ (ఆర్.కే)తో నిండా ప్రేమలో మునిగి ఉన్నప్పుడు ఆర్.కే అంటూ రెండక్షరాల్ని తన మెడ వెనక భాగంలో పచ్చబొట్టు (టాట్టూ) పొడిపించుకుంది. అది ఎప్పటికీ చెరగని శాశ్వత టాట్టూ. దాంతో రణవీర్ సింగ్ ని పెళ్లాడినా కానీ అది చెరిగిపోలేదు. దానిపైనా ఫోటో ఆధారాలతో అప్పట్లో మీడియాలో బోలెడన్ని కథనాలు వేడెక్కించాయి.

కానీ కాలక్రమంలో ఆ టాట్టూ మాయమైంది. ఇటీవలే  `చపాక్` రిలీజ్ ప్రమోషన్స్ కి వెళ్లినప్పుడు బ్యాక్ లెస్ ఫోజులో కనిపించిన దీపిక మెడపై పరిశీలిస్తే అక్కడ ఆ టాట్టూ కనిపించలేదు. ఇంతకీ ఆ టాట్టూని ఎలా చెరిపేయగలిగారు? అంటూ బాలీవుడ్ మీడియా ప్రశ్నిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా గుర్రుగా ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి వైపు కెమెరా వైపు చూస్తూ ఉండిపోయిందట. ఇక ఆ శాశ్వత టాట్టూ చెరిగిపోలేదని...  అంతా మేకప్ జిమ్మిక్ అని సోషల్ మీడియాల్లో డిబేట్లు నడిచాయి అప్పట్లో. చపాక్ లో యాసిడ్ ఎటాక్స్ బాధితురాలు.. సామాజిక కర్త లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక నటించిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దీపిక కోపంగా అలా చూస్తూనే ఎందుకని ఉండిపోయింది? అంటే.. అలాంటి చెత్త ప్రశ్నలు అడగవద్దనే దానర్థం. ఇక అప్పటికే పెళ్లయిన దీపికను విసిగించేలా ఇబ్బంది పెట్టేలా ప్రశ్నించడం ఆ విలేకరి తప్పేనని భావించాలి.