Begin typing your search above and press return to search.

'నా మొగుడికి 20గంటలు అదేపని' అంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   1 April 2020 10:30 AM GMT
నా మొగుడికి 20గంటలు అదేపని అంటున్న హీరోయిన్
X
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకోనె - రన్వీర్ సింగ్ ఇద్దరు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కి దేశంలోని సామాన్య ప్రజలతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ సమయాన్ని దీపిక - రన్వీర్ లు సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో వారి డైలీ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక రన్వీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. రన్వీర్ చాలా సింపుల్ మనిషి. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనా తట్టుకోగలడు. నా పనులకు ఎప్పుడు అడ్డు చెప్పడు. రన్వీర్ నాకు ఎలాంటి ఇబ్బందులను కలిగించట్లేదు.

ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయాన్ని నా భర్త రన్వీర్ చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. రోజులో ఎక్కువ శాతం నిద్రపోవడానికి కేటాయిస్తున్నాడు. సుమారు 20గంటలు నిద్రపోతున్నాడు. ఆ మిగతా నాలుగు గంటలో సమయంలో సినిమాలు - టీవీ చూడటం లాంటివి చేస్తున్నాడు. ఎలాంటి డిమాండ్స్ లేకుండా లైఫ్ గడుపుతున్నాడు. నాకు వంటచేయడం చాలా బాగా వచ్చు - ఇటాలియన్ - వెస్టర్న్ - కాంటినెంటల్ వంటలు చేస్తాను. రన్వీర్ అసలు వంటింట్లోకి రాడు. కానీ నాకు ఇండియన్ వంటలు నేర్చుకోవాలని ఉంది. మైదా పిండి - గోధుమ పిండి - ధనియాలు - పుదీనా వంటి వాటి మధ్య తేడాలను తెలుసుకోవాలి.. అంటూ చెప్పింది. ఇక లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు దేశమంతా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అందరం కూడా పరిస్థితులను అర్థం చేసుకొని మెలగాలి. జాగ్రత్తగా ఉండాలి అంటూ తన సందేశాన్ని పంచుకుంది.